Anasuya Bharadwaj: యాంకరింగ్ తో అనసూయ భరద్వాజ్ ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించిందా..!

Thu, 07 Nov 2024-6:01 pm,

జబర్ధస్త్ బ్యూటీ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదనే చెప్పాలి.  స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన  ఈ భామ ఆపై సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలొ దూసుకుపోతుంది. అంతేకాదు ఇన్నేళ్ల కెరీర్ లో ఈమె సంపాదించిన ఆస్తులు కూడా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నాయి.

అప్పట్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాగ’లో కాలేజీ స్టూడెంట్ పాత్రలో మెప్పించిన అనసూయ.. ఆ తర్వాత ఓ టీవీ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ గా ప్రేక్షకుల మనసు దోచుకుంది. ప్రస్తుతం టీవీ షోలకు స్వస్తి చెప్పి వరుసగా సినిమాలు చేస్తోంది.

అనసూయ యాంకర్ గా పాపులర్ అయిన తర్వాత సినిమాల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా అనసూయ నటనకు ప్రేక్షకుల మనసు దోచుకుంది.  అటు చిరుతో చేసిన ‘గాడ్ ఫాదర్’ సహా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం ఈమె టీవీ యాంకర్ గా.. నటిగా సంపాదించిన ఆస్తుల్లో పలు సంస్థల్లో ఇన్వెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈమె ఆస్తుల విలువ.. ఇళ్లు.. స్థిర, చరాస్తలు కలిపి రూ. 25 కోట్ల వరకు ఉంటుందనేది సమాచారం. 

రంగస్థలం తర్వాత పుష్ప సినిమాల్లో అనసూయ యాక్టింగ్ కు  నటనకు మంచి మార్కులే పడ్డాయి. రాబోయే ‘పుష్ప 2’ చిత్రంలో తన యాక్టింగ్ తో ఫిదా చేయడం పక్కా అని చెబుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

అనసూయ నటిగా ఎంత బిజీగా ఉన్న .. తన ఫ్యామిలీ మెంబర్స్ తో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కుటుంబం విషయంలో అనసూయ నిబద్ధతను మెచ్చుకోవాల్సిందే.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link