Anasuya: కొంటె చూపులతో కవ్విస్తున్న అనసూయ.. ఫొటోస్ వైరల్..!

Sun, 20 Oct 2024-6:30 pm,

జబర్దస్త్ యాంకర్ గా కెరియర్ ను మొదలుపెట్టి అది తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అనసూయ ఈమధ్య కాలంలో వెండితెరకే పరిమితమైన విషయం తెలిసిందే.ఒకవైపు తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్న ఈమె మరోవైపు అందచందాలతో యువతకు నిద్రలేకుండా చేస్తోంది. 

ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను అలరించే ఈమె.. తాజాగా మరో ఫోటోషూట్ తో అందరినీ ఆకట్టుకుంది   

చీర కట్టులో కొంటెగా ఫోటోలకు ఫోజులిచ్చి అభిమానులను కవ్వించింది. చిలిపిగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.   

బ్లూ కలర్ సారీ తో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి మరొకసారి తన అందాలతో అలరించింది. తాజాగా రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈమె,  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో..ఇవి కాస్త చాలా వైరల్ గా మారుతున్నాయి. 

అనసూయ సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్,  సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప -2 సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. అనసూయ ఇందులో దాక్షాయిణి అనే విలన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. 

ఎప్పుడు సరదాగా కనిపించే అనసూయ తనపై సోషల్ మీడియాలో ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రం గట్టిగా వారికి కౌంటర్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link