Anchor Anasuya: చీరలోనూ తగ్గేదే లేదంటున్న రంగమ్మత్త.. యాంకర్ అనసూయ శారీ పిక్స్ వైరల్

Sun, 11 Dec 2022-4:35 pm,

జబర్దస్త్‌ షోతో ఫేమస్ అయిన అనసూయ.. యాంకర్‌గా బుల్లితెరపై రాణిస్తునే.. నటిగా విభిన్నమైన పాత్రలతో తానేంటో ఎప్పటికప్పుడు నిరూపించుకుంది. అయితే తాజాగా ఒంగోలులోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో నటి మెహరీన్‌తో కలిసి సందడి చేసింది.  

అనసూయను చూసేందుకు భారీగానే  ఆమె ఫ్యాన్స్ షాపింగ్ మాల్ వద్దకు చేరారు. తన కోసం వచ్చిన అభిమానులను చూసి ఆమె ఫిదా అయిపోయింది. కొంత మంది అభిమానులతో సెల్ఫీలు దిగి అనంతరం ఫొటో షూట్‌లో పాల్గొన్నారు.  

ఈ పర్యటన తరువాత ఆమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి.. ఒంగోలు అభిమానులకు ఉద్దేశించి థ్యాంక్యూ అని ఓ వీడియో పోస్ట్ చేసింది.  

యాంకర్లలో అనసూయ క్రేజ్ వేరు. ఎప్పటికప్పుడు తన ఎక్సపోజింగ్ తోనూ, వీడియోలతో ఫ్యాన్‌కు దగ్గరవుతూనే ఉంది.   

ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో బిజీ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే పుష్ప-2 షూటింగ్ లో పాల్గొనబోతుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link