Anchor Anasuya: ఏడేళ్ల పిల్లాడికి లిప్ కిస్‌పై యాంకర్ అనసూయ రియాక్షన్ ఇదే.. రెచ్చిపోయిన స్టార్ సింగర్‌కు కౌంటర్
అనసూయ నటిగా సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తోంది. సరికొత్త పాత్రలు ఎంచుకుంటూ డిఫరెంట్ రోల్స్ పోషిస్తోంది. ఇక సినిమాల్లో బిజీగా ఉండే అనసూయకు కాంట్రావర్సీలు కూడా కాస్త ఎక్కువే.
ముఖ్యంగా ట్విట్టర్‌లో ఏదో ఇష్యూపై అనసూయ కామెంట్స్ వైరల్‌గా మారుతుంటాయి. విజయ్ దేవరకొండ విషయంలో చేసిన కామెంట్స్ రచ్చలేపాయి.
ఈ నేపథ్యంలోనే అనసూయ పాత వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తూ.. అందరినీ నీతుల చెప్పే అనసూయ ఎలా చేసిందో చూడాలంటూ కౌంటర్ ఇస్తున్నారు.
ఓ టీవీ షోలో పాల్గొన్న అనసూయ.. ఏడేళ్ల పిల్లాడిని ఎత్తుకుని బుగ్గ మీద, పెదాల మీద ముద్దు పెట్టించుకుంది.
దీంతో నెటిజన్లు వీడియోను వైరల్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. చిన్న పిల్లలకు అనసూయ ఏం నేర్పిస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ వీడియోపై స్టార్ సింగర్ చిన్మయి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనసూయ పేరు చెప్పకుండా తిట్టేశారు.
ఓ టీవీ షోలో హోస్ట్ చిన్న పిల్లోడి నోటిపై ముద్దు పెట్టడం తాను చూశానని.. చాలా భయంకరంగా అనిపించిదన్నారు.
ఇలాంటి చర్యలు పిల్లలపై చాలా ప్రభావం చూపిస్తాయని.. చిన్న పిల్లలకు గుడ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు. ఇలాంటి చర్యలు సమాజానికి ఏ మాత్రం ఉపయోగపడవంటూ రాసుకొచ్చారు.
చిన్మయి కామెంట్స్‌కు అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 'అది పదేళ్ల క్రితం చేసిన షో. అది అప్పుడు తప్పు కాదు. అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు చేస్తే కచ్చితంగా తప్పే. ఆ వీడియోపై స్పందించిన సింగర్ కాస్త చూసుకుని రియాక్ట్ అవ్వాలి. వెనుకా ముందు చూసుకుని స్పందించాలి. ఆ సింగర్ నన్ను అడిగి ఉంటే చెప్పేదాన్ని. అప్పుడు అది తప్పు కాదు. ఈ టైమ్‌కు వర్తించినది కాదు. ఇలాంటి క్లిక్ బైట్స్‌కు బానిసలు కాకండి.." అంటూ అనసూయ ఇన్‌స్టా లైవ్‌లో పేర్కొంది.