Anchor Marriage: 37 ఏళ్ల వయసులో స్టార్ యాంకర్ పెళ్లి.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా..!

గత పదేళ్లుగా కన్నడ బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తోంది అనుశ్రీ. తన మాటల గారడీతో ఇట్టే ఆకట్టుకోవడంతో ఈ భామకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అయితే 37 ఏళ్లు వచ్చినా ఇంకా వివాహం చేసుకోలేదు. అనుశ్రీ ఎక్కడికి వెళ్లినా పెళ్లి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఓ స్టార్ హీరోను సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లు ప్రచారం జరిగినా.. అవన్నీ రూమర్లేనని తేలిపోయింది.
మార్చి నెలలో తాను పెళ్లి చేసుకోనున్నట్లు ఈ బ్యూటీ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక యాంకర్‌గానే కాకుండా ఆడియో ఫంక్షన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తూ అనుశ్రీ కాస్త గట్టిగానే సంపాదించినట్లు తెలుస్తోంది.
ఆమె ఒక్క ఎపిసోడ్‌కు దాదాపు రూ.లక్ష వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. పేదరికం నుంచి వచ్చిన అనుశ్రీ.. ఎన్నో కష్టాలను దాటుకుంటూ టాప్ యాంకర్‌గా ఎదిగింది.
ఆమెకు లగ్జరీ ఇల్లు, కారు ఉంది. ఈ బ్యూటీ ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్లుగా ఉంటుందని శాండల్‌వుడ్‌లో టాక్.