Anchor Rashmi: పొట్టి గౌనులో యాంకర్ రష్మీ మెరుపులు.. క్రేజీ లుక్స్‌తో వల
బుల్లితెరపై యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అప్పటి నుంచి ఈ షోలోనే కొనసాగుతోంది.
జబర్దస్త్ షో నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోతున్నా.. రష్మీ మాత్రం తనకు లైఫ్ ఇచ్చిన షోను వదులుకోలేదు.
ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్‌గా వ్యవహరిస్తోంది.
ఓ వైపు టీవీ షోలు చేస్తునే.. మరోవైపు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది రష్మీ.
ఇటు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింగ వైరల్ అవుతున్నాయి.