Pawan Kalyan: సమంత, శ్రీ లీల ఉండగా పవన్ స్పెషల్ సాంగ్ కోసం ఆమెనే ఎందుకు ఎంచుకున్నారో..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన ఈయన ప్రతి ఒక్కరికి కష్టం రాకుండా చూసుకోవాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారు.
ఇకపోతే తన అభిమానులను కూడా సంతోషపరచడానికి తాను చేయాల్సి వున్న.. పెండింగ్లో ఉన్న మూడు సినిమాలను కూడా చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అందులో భాగంగానే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేసి అభిమానుల కోసం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మరొకవైపు జబర్దస్త్.. ద్వారా యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది అనసూయ. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారింది. ఒకవైపు నటిస్తూనే మరొకవైపు విలన్ గా కూడా అలరిస్తోంది. తాజాగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప -2 సినిమాలో నటించి విలన్ గా సత్తా చాటుంది. కాగా ప్రస్తుతం అనసూయ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో.. అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. హరిహర వీరమల్లు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని అందులో అనసూయ మెరవనంది అని.. వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో..దీనిని గతంలోనే షూట్ చేశారట అయితే అధికారికంగా చెప్పలేదు. ఈ సాంగ్లో ఇక ఒకటి లేదా రెండు సీన్లు మిగిలి ఉండగా.. అవి కూడా పూర్తి చేస్తారని. ఎం ఎం కీరవాణి కంపోజ్ చేసిన నెంబర్. దీనికోసమేనని అందరూ అంటున్నారు. మరి అనసూయ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చే ఈ సాంగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.
ఇకపోతే సమంత, శ్రీ లీలా లాంటి స్టార్ హీరోయిన్స్ ఉండగా ఐటమ్ సాంగ్ కి ఒక యాంకర్ ను ఎంచుకోవడం ఏంటి అంటూ అభిమానుల.. సైతం ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పుష్ప సినిమాలో సమంత, పుష్ప 2 సినిమాలో శ్రీ లీల ఇద్దరు కూడా తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో అబ్బురపరిచారు. దాదాపు స్టార్ హీరోలు అందరూ కూడా.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ తో ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్.. అనసూయ లాంటి వాళ్లతో ఐటమ్ సాంగ్ ఎందుకు చేయనున్నారు అని.. అభిమానుల సైతం నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం.. పవన్ కళ్యాణ్ పక్కన ఎవరు స్పెషల్ సాంగ్ చేసినా.. అక్కడ ఉండేది పవన్ కళ్యాణ్ కాబట్టి.. తప్పకుండా సాంగ్ కి క్రేజ్ రావడం ఖాయం అంటూ కామెంట్లో పెడుతున్నారు.