AP Cabinet: ఏపీ కాబినేట్ సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే..
AP Cabinet: 2024 ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు, వాటి అమలకు తీసుకోవలసిన చర్యలపై ఈ కాబినేట్ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధానంగా దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఏపీ కేబినెట్ ఆమోదించనుంది.
కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్ధిదారులు , పథకానికి అర్హుల ఎంపిక , ఆర్థిక భారం వంటి అంశాలపై చర్చించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చెత్త పన్ను రద్దు పైన ఇప్పటికే చంద్రబాబు ప్రకటన చేశారు.
ఈ నిర్ణయం అమలుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. మున్సిపాలిటీల్లో కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదన పై కూడా మంత్రివర్గం చర్చలు జరపనుంది.
దీంతో పాటు ఇప్పటికే ఏపీలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి కొత్త లిక్కరు షాపులు ఓపెన్ చేసారు. దీనిపై ప్రజా స్పందనతో పాటు ఎలా ఉందనే విషయమై రివ్యూ మీటింగ్ చేయనున్నారు.
మరోవైపు సూపర్ సిక్స్ లో భాగంగా అమ్మ ఒడిలో భాగంగా ఇంట్లో అందరి పిల్లలకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ తో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి దశల వారీగా అమల్లోకి ఎలా అమల్లోకి తీసుకు రావాలనే అంశం కూడా కాబినేట్ మీటింగ్ లో చర్చకు రానున్నట్టు సమాచారం.