Chandrababu naidu: తిరుమల లడ్డులో ఎనిమల్ ఫ్యాట్.. సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..

Wed, 18 Sep 2024-10:03 pm,

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాంగా ప్రకంపలకు కారణమతున్నాయి. తిరుమల తిరుపతి దేవ స్థానంను ఎంతో పవిత్రంగా భావిస్తాం. అలాంటి తిరుమలలో గత  వైఎస్సార్సీపీ  ప్రభుత్వం.. అరాచకాలకు  పాల్పడిందని కూడా చంద్రబాబు విమర్శించారు. ఎక్కడికక్కడ తిరుమలను అపవిత్రంచేశారన్నారు.

తిరుమలకు వెళ్లిన ప్రతిఒక్క భక్తుడు కూడా లడ్డును ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటిది లడ్డును కూడా గత వైసీపీ ప్రభుత్వం కల్లీకీ పాల్పడిందని అన్నారు. ఏకంగా లడ్డును తయారు చేయడానికి జంతువుల ఎముకల నుంచి తయారు చేసిన నెయ్యిని ఉపయోగించారని బాంబును పేల్చారు.   

వైసీపీ ప్రభుత్వ హయాంలో.. తిరుమల శ్రీవారి ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలను అపవిత్రం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. 

వైఎస్ జగన్ ప్రభుత్వం తిరుమలలో దుర్మార్గంగా వ్యవహరించిందన్న చంద్రబాబు.. భక్తులకు నాసిరకం లడ్డూలు, నాణ్యతలేని అన్నప్రసాదం పంపిణీ చేసిందంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. దీనిపై వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చిందని చెప్పుకొవచ్చు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే.. దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందలకోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబునాయుడు దారుణంగా తీసాడన్నారు. తిరుమల ప్రసాదంపైచంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు.

మనిషి పుట్టుక పుట్టినవారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరని ఫైర్ అయ్యారు. కేవలం..  రాజకీయం లబ్ధికోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపితం అయ్యిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబుకూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?.. అంటూ గత వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు.   

ఇదిలా ఉండగా.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా.. తిరుమలలో ప్రకాళన స్టార్ట్ చేశారు. టీటీడీకి కొత్త..ఈవోగా శ్యామల రావును నియమించారు. ఆయన ఎప్పటికప్పుడు.. తిరుమలలో ఉన్నసమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ప్రజలతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఇటీవల తిరుమలలో ఉచిత దర్శనం, లడ్డులు, మొదలైన వాటి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  

ప్రస్తుతం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ దుమారం రాజుకుంది. కోట్లాది మంది భక్తుల మనో భావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారని కూడా వైఎస్సార్సీసీ నేతలు ఖండిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ మాత్రం.. గత వైసీపీ ప్రభుత్వంతిరుమలలోఅనేక అరాచకాలకు పాల్పడిందంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link