Chandrababunaidu: సీఎంగా చంద్రబాబు.. జూన్ 9 న అమరావతిలో ప్రమాణ స్వీకారం..?..
దేశంలో ఎన్నికల ఫలితాలు వెలుడతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు ఒక రేంజ్ లో హీట్ ను పుట్టించాయి. ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అధికార వైఎస్సార్సీపీ పార్టీ వైనాట్ 175 సీట్ల నినాదంతో ఎన్నికల బరిలో దిగింది.
ప్రజలకు నవరత్నాలతో అనేక పథకాలు తీసుకొచ్చామని, తమకే మరోసారి పట్టం కడతారని సీఎం జగన్ ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఫలితాలు పూర్తిగా తలకిందులుగా మారాయి. అనేక మంది మంత్రులు, కీలక నేతలు ఈసారి ఓడిపోవడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. దాదాపు అన్ని రౌండ్ లలో కూడా కూటమి నేతలు భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. ఇదే క్రమంలో.. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ కనీసం.. అపోసిషన్ హోదాలో ఉన్న సీట్లు అయిన వస్తాయా అని రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కూటమి నేతలు మాత్రం ఫుల్ జోష్ తో ఉన్నారు.
ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపు ఖరారైంది. టీడీపీ, జనసేన, బీజేపీలు ఈసారి కూటమిగా ఎన్నికల బరిలో నిలిచారు. అంతేకాకుండా.. అధికార వైఎస్సార్సీపీని చిత్తు చిత్తుగా ఓడించని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.
టీడీపీ కార్యాలయాలన్నింటి వద్ద బాణసంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. నాలుగోసారి సీఎంగా చంద్రబాబు జూన్ 9 న ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీని కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ప్రధాని మోదీ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి విషేస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబును.. ఇండియా కూటమి నేతలు కూడా కలిసినట్లు తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు కూటమి సపోర్టు కీలకంగా మారిందని చెప్పుకొవచ్చు.