School Holidays 2024: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హలీడేస్ ప్రకటించిన ప్రభుత్వం..
కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. బైటకు వెళ్లాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. తప్పనిసరైతే తప్ప.. ఎండకు బైటకు వెళ్లకూడదని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఈసారి ఎండలు గతేడాది కంటే ఈసారి ఎక్కువగా ఉండనున్నాయని వాతావరణ శాఖ ఇవి వరకు చెప్పింది. ఈ క్రమంలో.. ఎండకాలం నేపథ్యంలో ప్రభుత్వాలు సామాన్యులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు చేస్తున్నారు.
స్కూల్ పిల్లలకు ఇప్పటి వరకు ఒంటి పూట బడులను ప్రభుత్వాలు నిర్వహించాయి. ఇదిలా ఉండగా.. ఎండల ప్రభావం వల్ల తల్లిదండ్రులు కూడా బెంబెలెత్తిపోతున్నారు. తమ పిల్లలను స్కూల్ కు పంపడానికి భయపడిపోతున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో ఎన్నికల హీట్ ఒకవైపు నడుస్తోంది. మరోవైపు ఎండలు కూడా చుక్కలు చూపిస్తున్నాయ. ఇదిలా ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎండల నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు ఉండనున్నాయి. జూన్ 12 న స్కూళ్లు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఈనెల 23 న స్కూల్లకు లాస్టింగ్ వర్కింగ్ డే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.