AP Pension: పింఛన్ లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
AP PH Pension: ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ఆరోగ్య పింఛన్స్ కు సంబంధించిన ఈ వెరిఫికేషన్ లో మంచానికి, వీల్చైర్లకు పరిమితమై నెలకు రూ. 15వేల పింఛన్ పొందుతున్నవారతో పాటు దివ్యాంగుల కోటాలో నెలకు రూ. 6వేలు పొందుతున్నవారి పింఛన్లను సంబంధించి అధికారులు వెరిఫై చేస్తారు. వైద్య బృందాలు నేటి నుంచి తనిఖీలు చేపడుతున్నాయి.
మంచానికి, వీల్చైర్లకు పరిమితమై పింఛన్ అందుకునేవారి ఇంటికి వైద్య బృందాలు వెళ్లి తనిఖీ చేస్తాయి. అలాగే దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందుతున్నవారు దగ్గరలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
వీరు ఏ రోజు తనిఖీల కోసం రావాలో ముందుగానే సమాచారం ఇస్తారు. ప్రధానంగా వీరి అర్హతను మాత్రమే పరిశీలిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా అన్ని జిల్లాల్లో వైద్య బృందాలను నియమించారు.
ఈ టీమ్‌లు నిర్దేశిత తేదీల్లో పింఛన్ తీసుకునే లబ్ధిదారుడి ఇంటికి వెళతారు.. భౌతిక ఆరోగ్య పరిస్థితిని మెడికల్ గా పరిశీలిస్తారు. ఈ పింఛన్లను తనిఖీ చేస్తున్న టీమ్‌లో ఒక ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు, స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు
ఈ తనిఖీలు సంబంధించి లబ్ధిదారులకు ముందుగానే సమాచారం ఇస్తారు. డాక్టర్ల బృందం వెళ్లిన సమయంలో లబ్ధిదారులు తప్పనిసరిగా ఇంటి దగ్గర అందుబాటులో ఉండాలని సూచించారు. ఒకవేళ లబ్ధిదారులు అందుబాటులో కనుక లేకపోతే.. వారి పింఛన్‌ను తాత్కాలికంగా హోల్డ్ లో ఉంచుతారు.
గత గవర్నమెంట్ లో అర్హత లేనివారికి కూడా పింఛన్లు ఇచ్చారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు గత నెలలో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాలలో నిర్వహించిన సర్వేలో ఆరోగ్య, దివ్యాంగ కోటాలో పింఛన్లు తీసుకుంటున్నవారు తప్పుడు పత్రాలతో పింఛన్ తీసుకుంటున్నట్లు తేలింది.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే పింఛన్లను తనిఖీ చేయాలని ఆదేశించారు.. అందుకే నేటి నుంచి తనిఖీలు మొదలవుతున్నాయి. ఈ తనిఖీల తర్వాత కూడా ఇంకా ఎవరైనా అనర్హులు కొనసాగితే కనుక వైద్య బృందాలపై, సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.