TTD Board: శ్రీవారు అప్పట్లోనే ముస్లింల అల్లుడు.. టీటీడీ బోర్డు వ్యవహారంపై మళ్లీ రాచుకుంటున్న పెను దుమారం..

Wed, 06 Nov 2024-6:31 pm,
Tirumala news:

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల చంద్రబాబు సర్కారు కొత్తగా టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది. బీఆర్ నాయుడును చైర్మన్ గా ఏపీ సర్కారు నియమించింది. అయితే.. తాజాగా, ఈ టీటీడీ బోర్డు వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.   

Tirumala news:

మెయిన్ గా టీటీడీ బోర్డులో ముస్లింలకు ఎందుకు అవకాశం ఇవ్వరని కూడా తీవ్ర స్థాయిలో వివాదం నడుస్తొంది. ముస్లిం వక్ఫ్ బోర్డులో హిందువులకు అవకాశం కల్పించినప్పుడు.. టీటీడీ బోర్డులో ముస్లింలకు అవకాశం ఇవ్వడంలో మీకు వచ్చిన నష్టం ఏంటని కూడా మైనారీటీలు ఫైర్ అవుతున్నారు.

Tirumala news:

ఈ నేపథ్యంలో..ఏపీ రాష్ట్ర అహలేసున్నత్  జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ రాజా దీనిపై స్పందించారు. వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మ ముస్లిం మహిళను వివాహమాడిన 700 సంవత్సరాల చరిత్ర వాస్తవమే కదా.. అప్పుడు మరీ మాకు టీటీడీలో ఎందుకు అవకాశం ఇవ్వరని కూడా మండిపడుతున్నారు.  

బీబీ నాంచారమ్మ విగ్రహం ఎన్నో సంవత్సరాలుగా పూజలు అందుకున్నప్పుడు.. ఇప్పుడు మైనార్టీ వ్యక్తుల్ని పూజించేందుకు వచ్చిన నష్టమేంటని కూడా విమర్శలు గుప్పించారు. ఇక్కడ హిందూ-ముస్లిం అనే భేదం ఎన్నడు లేదని.... ఎందుకంటే అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్కరూ షర్ఫుద్దీన్ బాబా ఓవర్ స్వామి దర్గా దర్శించుకోవడం  సాంప్రదాయంలో భాగంగా వస్తుదన్నారు.    

 బ్రహ్మంగారి ప్రియ శిష్యుడైన సయ్యద్ సాబ్ సిద్దయ్య లేరా..  భద్రాచలం రాములవారికి రాముల వారి కళ్యాణానికి హైదరాబాద్ నవాబులు  ఆనాటి నుంచి ఈనాటి వరకు అది ఒక సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పిస్తున్నామన్నారు. పీర్ల పండగను ఎంతో పవిత్రంగా జరుపుకుంటాం. ఇలాంటి సమయంలో టీటీడీ బోర్డులో ముస్లింల వ్యక్తి ఉంటే వచ్చిన నష్టంఏంటని కూడా పలువురు మైనారీటీలు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తొంది.  

దక్షిణ భారతదేశంలో చాలామంది హిందువులు సైతం గాలిబ్ రావు  మస్తాన్ రావు సైదులు హజరత్ అయ్యా కాసిం హుస్సేన్ ఇలాంటి పేర్లు పెట్టుకోవడం అనేది దక్షిణ భారతదేశంలో ఉన్న మత సామరస్యం వర్ధిల్లుతూ ఈ బంధాలు అనుబంధాలు  అప్పటికి ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో కొనసాగుతూనే ఉన్నాయి.  

ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో పాటు దేశంలో కూడా టీటీడీ కొత్త బోర్డు వివాదం రచ్చగా మారిందని చెప్పుకొవచ్చు. దీనిపై ఇటీవల హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. మరొవైపు  ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా దీనిపై కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link