Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినీ జంప్..?.. ఆ పార్టీ లోకి వెళ్తున్నట్లు జోరుగా వార్తలు..

Tue, 18 Jun 2024-5:03 pm,

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. గత ఐదేళ్లలో ఏపీ అన్నిరంగాల్లో వెనక్కు వెళ్లిపోయిందని ఇప్పటికే అనేక మంది కూటమి నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇక ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. ఏపీకి తిరిగి పునర్వైభవం తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

అదే విధంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, మోసాలు, అక్రమాలను కూడా టీడీపీ ప్రభుత్వం ప్రజలముందుకు తీసుకొస్తుంది. అదేవిధంగా వీరిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని కూడా కూటమి నేతలు క్లారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ రుషికొండ మాయమహల్ నిర్మాణాలు ఇటీవల తీవ్ర రచ్చకు దారితీశాయి.  

ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీకి ఇటీవల ఎన్నికలలో 11 సీట్లు వచ్చాయి. చాలా మంది నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే  వైసీపీ కి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు, శిద్దా రాఘరావులు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో మాజీ మంత్రి పార్టీని వీడబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

విడదల రజిని తొలుత రాజకీయాల్లో వచ్చినప్పుడు..  తెలుగు దేశం పార్టీలో చేరారు... ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ కండువ కప్పుకున్నారు.  రజినికి అనూహ్యంగా చిలకలూరిపేట టికెట్ దక్కగా.. ఎన్నికల్లో అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమెకు ఏకంగా వైద్యఆరోగ్యశాఖ మంత్రి పదవి దక్కింది.

2024 ఎన్నికలలో వైఎస్ జగన్ తన కొంప మునిగే పనులు చేజేతులా చేసుకున్నాడు. వైఎస్సార్‌సీపీ అధిష్టానం విడదల రజినికి చిలకలూరి పేట నుంచి కాకుండా, గుంటూరు పశ్చిమ టికెట్ ఇచ్చారు. ఇక ఈ స్థానాన్ని మల్లెల రాజేష్‌కు అవకాశం ఇచ్చారు. మరల ఆయన్ను కూడా మార్చి కావటి శివమనోహర్ నాయుడికి చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు. 

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంనుంచి విడదల రజినీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి.. టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి చేతిలో 51వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు చిలకలూరి పేటలో కూడా మనోహర్ నాయుడు ఓటమిపాలయ్యారు. అయితే తాజాగా విడదల రజిని పార్టీ మారుతున్నట్లు ప్రచారం మొదలైంది.

జాతీయ పార్టీ నేతలతో ఆమె చర్చ జరిపినట్లు కూడా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.  దీని విషయమై కాల్ చేస్తే.. విడదల రజీని  ఫోన్‌లో కూడా టచ్‌లో లేరని చెబుతున్నారు. వైసీపీ అధిష్టాన పెద్దలకు అందుబాటులో లేరని తెలుస్తోంది.  కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ వాళ్లు కొట్టిపారేస్తున్నారు. దీనిపై మాత్రం విడదల రజీనీ స్పందిచాల్సి ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link