Tripti Dimri: బ్యాక్ లెస్ డ్రెస్సులో తృప్తి.. ఇక యువతకి నిద్ర లేనట్టే

బాలీవుడ్ లో అప్పటికే ఎన్నో సినిమాలు చేసిన ఈ హీరోయిన్ కి నేషనల్ వైడ్ యానిమల్ సినిమా ఎంతో పేరు తెచ్చి పెట్టింది. నార్త్ ప్రేక్షకులనే కాకుండా సౌత్ ప్రేక్షకులను సైతం ఈ చిత్రంతో ఆకట్టుకుంది ఈ హీరోయిన్.

సందీప్ ప్రతివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా చేసిన యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మిక అయినప్పటికీ..తృప్తి డిమ్రి అందం యువతను ఎక్కువగా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో జోయ పాత్రలో కనిపించి అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది ఈ నటి. అంతేకాదు ఈ చిత్రంతో ఏకంగా నేషనల్ క్రష్ గా కూడా మారిపోయింది..
ప్రస్తుతం పలు హిందీ సినిమాలతో బిజీగా ఉన్న తృప్తి ఇంస్టాగ్రామ్ ఫోటోలు తన అభిమానులను తెగ అలరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో బ్లూ టవర్ లాంటి డ్రెస్సులో తృప్తి షేర్ చేసిన ఫోటోలు యువతను నిద్ర లేకుండా చేస్తున్నాయి.