Anjali: రెడ్ డ్రెస్ లో తెగ అలరిస్తున్న అంజలి…50వ సినిమా ప్రమోషన్స్ కోసం విన్నుతంగా!!
షాపింగ్ మాల్ అనే తమిళ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అంజలి. ఆ సినిమాలో ‘నా ప్రాణం నువ్వైపోతే..’పాత ప్రేక్షకులకు ఎంత దగ్గర అయిందో.. అంజలి కూడా తన అందం.. నటనతో ప్రేక్షకులకు అంతకన్నా ఎక్కువ చేరువైంది.
ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి లో జన్మించిన అంజలి ఫోటో అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది. అయితే తన మొదటి రెండు చిత్రాలు ఫోటో, లవ్ లెటర్ జ్యూస్ అసలు ఎప్పుడు విడుదలయ్యాయి అనే విషయం కూడా తెలియనంత ఫ్లాప్ అయ్యాయి.
ఆ తరువాత తన మక్కాం చెన్నైకి మార్చి తమిళంలో మంచి విజయం అందుకుంది. ఎన్నో తమిళ సినిమాలలో నటించిన అంజలి తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్ తో చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది.
ఆ చిత్రం మంచి విజయం సాధించిన దగ్గర నుంచి అంజలీకి తమిళం తో పాటు తెలుగులో కూడా ఆఫర్లు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా తాను ప్రాధాన్య పాత్రలో కనిపించిన గీతాంజలి సినిమా మంచి విజయం సాధించి అంజలి కి మరింత పేరు తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం ఈ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గీతాంజలి మళ్లీ వచ్చింది అని చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఈ హీరోయిన్. ఈ సినిమా అంజలి 50వ సినిమా కావడం విశేషం.
తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం అంజలి రెడ్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు మన అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.