Sachin Anjali: అంజలి కోసం అత్తకే ఛాలెంజ్‌ చేసిన సచిన్‌ టెండూల్కర్‌.. ఏం జరిగింది?

Wed, 14 Aug 2024-11:11 pm,
Sachin Anjali Love

అత్త నోటి నుంచి..: క్రికెట్‌ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్రేమ విషయమై ఆసక్తికర విషయాలను అతడి అత్త వెల్లడించారు. తన కూతురు అంజలి ప్రేమకథను ఆమె తల్లి వివరించారు.

Sachin Anjali Marriage

కొందరికే తెలుసు..: క్రికెట్‌కు సంబంధించిన సచిన్‌ రికార్డులు దాదాపుగా ప్రజలందరికీ తెలుసు. కానీ అతడి ప్రేమ విషయం మాత్రం కొందరికే తెలుసు. తాజాగా వారి ప్రేమ వ్యవహారం ఎలా సాగిందో.. తన కన్నా పెద్ద వయస్కురాలిని పెళ్లి చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు అతడి అత్త చెప్పారు.

Sachin Anjali Family

పెళ్లిపై అనుమానాలు...: సచిన్-అంజలి 24 మే 1995న వివాహం చేసుకున్నారు. వారి వివాహానికి 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంజలి కంటే సచిన్‌ ఐదేళ్లు చిన్నవాడు. అలాంటి సచిన్‌ను పెళ్లి చేసుకుంటానని అంజలి తల్లి అన్నాబెల్లె మెహతా చాలా అనుమానాలు వ్యక్తం చేశారంట!

అంజలి తల్లి సందేహం: సచిన్‌- అంజలి పెళ్లి విషయమై తాజాగా అన్నాబెల్లె మెహతా వివరించారు. నాడు జరిగిన సంఘటలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు చెప్పారు.

సచిన్‌ పొడుగ్గా ఉంటాడనుకున్నా..: 'అంజలి తనకంటే ఐదేళ్లు చిన్న వ్యక్తితో ప్రేమలో పడింది. మా ఇంటికి వచ్చినప్పుడు అతడికి 19 ఏళ్లు మాత్రమే. అంజలి ఐదున్నర అడుగుల ఎత్తు ఉండడంతో సచిన్ కూడా అలానే ఉంటాడని నేను అనుకున్నా. కానీ క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతున్నాడని తర్వాత తెలిసింది' అని అన్నాబెల్లె తెలిపారు.

ఆశ్చర్యపోయా...!: 'సచిన్‌ను చూసినప్పుడు కొంత అనుమానం కలిగింది. అతడు కొంతమంది క్రికెటర్ల మాదిరిగా ప్లేబాయ్‌గా ఉంటాడేమోనని నాకు అనుమానం వచ్చింది. దీని గురించి సచిన్‌తో మాట్లాడాలని అనుకున్నా. కానీ సచిన్ నేరుగా అంజలిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నేను ఆశ్చర్యపోయా!. ఆ తర్వాత వారిద్దరి ప్రేమను అర్థం చేసుకున్నా' అని సచిన్‌ అత్త అన్నాబెల్లె మెహతా వివరించారు.

ఇంకా అన్యోన్యంగా...|| వారిద్దరి వివాహమై ముప్పై యేళ్లు దాటినా ఇంకా అన్యోన్యంగా ఉంటున్నారు. సచిన్‌, అంజలికి కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు అర్జున్‌ టెండూల్కర్‌ క్రికెటర్‌ కాగా.. కుమార్తె సారా టెండూల్కర్‌.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link