ANR Vs Chiranjeevi: అప్పట్లో ఏఎన్నార్ ను నవ్వుల పాలు చేసిన చిరంజీవి.. అసలు మ్యాటర్ ఇదే..
అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ కంటే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అంతేకాదు అన్ని రకాల పాత్రల్లో నటించే నటుడుగా సత్తా చాటాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తన కంటూ ఓ పేజీలే రాసుకున్నారు.
చిరంజీవి తన తరంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మాములు స్థాయి నుంచి మెగాస్టార్ గా ఎదిగారు. చిరు.. తన కెరీర్ తొలినాళ్లలో అప్పటి సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబులతో సెకండ్ హీరోగా మల్టీస్టారర్ మూవీస్ చేసారు. కానీ అక్కినేని నాగేశ్వరరావుతో స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయారు.
ఇక 90వ దశకం తొలినాళ్లలో అక్కినేని నాగేశ్వరరావుతో చిరంజీవికి కలిసే నటించే అవకాశం దక్కింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాణంలో బి.గోపాల్ దర్శకత్వంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘మెకానిక్ అల్లుడు’ సినిమా తెరకెక్కింది.
‘మెకానిక్ అల్లుడు’ సినిమా అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘శ్రీరంగనీతులు’ సినిమానే కాస్త స్టోరీ అటు ఇటు మార్చి తెరకెక్కించారనే విమర్శలొచ్చాయి.
ముఖ్యంగా గురువా గురువా పాట అప్పట్లో పెద్ద ఫేమస్ అయింది. కానీ కమర్షియల్ గా పెద్దగా విజయం సాధించలేదు. పైగా ఈ సినిమాలో చిరు.. అక్కినేని డామినేషన్ చేసే రీతిలో సినిమా ఉండటంతో అక్కినేని అభిమానులు ఒకింత నొచ్చుకున్నారు. ఓ రకంగా ఈ సినిమాతో ఏఎన్నార్ నవ్వుల పాలయ్యారు.
ఇక 1993లో అక్కినేని నాగేశ్వరరావు తో పాటు తన తరం హీరో ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటించిన ‘మేజర్ చంద్రకాంత్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అందుకున్నారు. అటు కృష్ణ.. పచ్చని సంసారం, శోభన్ బాబు. .‘ఏవండి ఆవిడొచ్చింది, కృష్ణంరాజు ..బావ బావమరిది’ సినిమాలతో హిట్స్ అందుకున్నారు. కానీ ఏఎన్నార్ మాత్రం ఫ్లాప్ ను మూట గట్టుకున్నాడు.
ఈ రకంగా చిరంజీవితో చేసిన సినిమా వల్ల అక్కినేని నాగేశ్వరరావు నవ్వుల పాలయ్యరనే విషయాన్ని ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి నటించలేదు. తాజాగా అదే అక్కినేని పేరుతో ఉన్న ఏఎన్నార్ జాతీయ అవార్డును చిరంజీవి అందుకోవడం విశేషం.