Anupama Parameswaran Brother : హ్యాపీ బర్త్ డే బామ్మర్ది!.. అనుపమ తమ్ముడిపై నెటిజన్ల సెటైర్లు.. చిన్ననాటి పిక్స్ వైరల్
అనుపమకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అనుపమ తన క్యూట్ ఫోటోలతో అందరినీ కట్టిపడేస్తుంటుంది.
అనుపమ ఎక్కువగా చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తుంటుంది. అలానే తన తమ్ముడిని ఆడుకునే తీరు కూడా అందరినీ మెప్పిస్తుంది.
అక్కాతమ్ముళ్ల ఆటలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేమస్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు అనుపమను ఇష్టపడే వారంతా కూడా అనుపమ తమ్ముడు అక్షయ్‌ను ఆడేసుకుంటున్నారు.
అనుపమ తమ్ముడు అక్షయ్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా చిన్న నాటి ఫోటోలను షేర్ చేసింది అనుపమ. ఈ ఫోటోలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
కామెంట్లలో బామ్మర్ది అనే పదం తప్పా ఇంకోటి కనిపించడం లేదు. బామ్మర్ది పార్టీ లేదా? అని అడిగేస్తున్నారు.