Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?
కేరళ కుట్టి అయిన అనుపమ తెలుగు నాటే ఎక్కువగా ఫేమస్ అయింది. ఇక్కడే ఆమెకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఆమె కెరీర్లో ఎక్కువగా చేసింది కూడా తెలుగు సినిమాలే.
అనుపమ అందం కావాల్సినంత ఉంది కానీ అదృష్టం మాత్రం అంతగా లేదనిపిస్తుంది. అనుపమ నటించే చిత్రాలు వర్కౌట్ కాకపోయినా ఆమెకు మాత్రం క్రేజ్ తగ్గలేదు.
గత ఏడాది మాత్రం అనుపమకు బాగానే కలిసి వచ్చింది. నిఖిల్‌తో కలిసి నటించిన కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.
ఇప్పుడు అనుపమకు ఫుల్ క్రేజ్ వచ్చింది. వరుసగా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. డీజే టిల్లు సీక్వెల్లో హీరోయిన్గా అనుపమను తీసుకున్నారు.
తాజాగా జుట్టుకు ఆయిల్ పెట్టుకుని, ఇలా కొప్పున పూలు పెట్టుకుని అనుపమ కనిపించింది. తనకు నచ్చదని, చీ అంటూ ఫోటోలను షేర్ చేసింది.