Anupama Parameswaran: గ్లామర్ డోస్ మరింత పెంచిన అనుపమ.. బ్లాక్ డ్రెస్సులో మైండ్ బ్లాక్..

Mon, 27 May 2024-12:40 pm,

నాగచైతన్య హీరోగా చేసిన ప్రేమమ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించిన మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ ఆ సినిమాతో మరింత పేరు తెచ్చుకుంది.

ఆ సినిమాలో నాగవల్లి పాత్రలో కనిపించి.. ఈ హీరోయిన్ కి తెలుగులో అవకాశాలు రావడం ఖాయం అనేటట్టు చేసుకుంది. దానికి తగ్గట్టే ఈ మలయాళీ భామకి ఆ తరువాత తెలుగులో కూడా వరుసగా ఆఫర్లు వచ్చాయి.  

కానీ అనుకున్న స్థాయిలో విజయాలు మాత్రం రాలేదు. దాంతో అనుపమాకి ఆఫర్లు కాస్త తగ్గుతూ వచ్చాయి. అయితే నిఖిల్ తో ఈ హీరోయిన్ చేసిన కార్తికేయ 2 సినిమా మాత్రం పాన్ ఇండియా పరంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.  

ఆ తరువాత మళ్లీ ఈ హీరోయిన్ వలస అవకాశాలు తెచ్చుకుంటూ ముందుకు సాగింది. ఇక ఈమధ్య సిద్దు జొన్నలగడ్డతో చేసిన టిల్లు స్క్వేర్ అనుపమకి మరో సూపర్ హిట్ ఇచ్చింది.

ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచి అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది అనుపమ. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link