Anupama Parameswaran: నల్ల చీరలో కాటుక కళ్లతో కవ్విస్తోన్న టిల్లు భామ అనుపమ పరమేశ్వరన్..
అనుపమ పరమేశ్వరన్.. ఈ యేడాది ‘టిల్లు స్క్వేర్’ మూవీతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో లిల్లి జోసెఫ్ పాత్రలో అదరగొట్టేసింది.
అనుపమ పరమేశ్వర్ కేరళలోని ఇరంజకుడాలో 1996 ఫిబ్రవరి 18న జన్మించింది. అంతేకాదు మలయాళ క్లాసిక్ హిట్ ‘ప్రేమమ్’ మూవీతో తెరంగేట్రం చేసింది. అందులో మేరీ జార్జ్ పాత్రలో హీరో ఫస్ట్ లవర్ పాత్రలో అదరగొట్టింది.
అదే సినిమా తెలుగులో అదే ప్రేమమ్ టైటిల్ తో నాగ చైతన్య హీరోగా తెరకెక్కింది. ఈ సినిమాలో సుమగా చైతూ ఫస్ట్ క్రష్ గా నటించి మెప్పించింది.
మలయాళీ భామ అయిన అనుపమకు ప్రారంభంలో ఛాన్సులు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీతో ముందుగా ఈ భామనే అనుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్లేస్ లో సమంతను తీసుకున్నారు. ఒకవేళ ఈ పాత్ర అనుపమకు దక్కి ఉంటే ఆమె రేంజే వేరే లెవల్లో ఉండేది.
ప్రస్తుతం ఈమె స్టార్ హీరోల సరసన కాకుండా మిడ్ రేంజ్ హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారింది. నిఖిల్ సిద్దార్ధ్ తో చేసిన ‘కార్తికేయ 2’ తో ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది.
తాజాగా ఈ యేడాది ‘టిల్లు స్క్వేర్ మూవీతో హిట్ అందుకున్నా.. అనుపమకు పెద్దగా ఒరింగిందేమి లేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో వివిధ భాషల్లో అర డజనుకు పైగా చిత్రాలున్నాయి.