Virat Kohli Birthday Special: వెరైటీ ఫొటోలు షేర్ చేసిన అనుష్క శర్మ.. చూస్తే నవ్వు ఆపుకోలేరు

Sat, 05 Nov 2022-1:29 pm,

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు సెలబ్రిటీ ప్రపంచంలో మోడల్ కపుల్‌గా నిలిచారు. ఈరోజు కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా అనుష్క శర్మ విరాట్‌కి సంబంధించిన ఫన్నీ ఫోటోలను షేర్ చేసింది. విరాట్ కోహ్లీకి సంబంధించిన ఫన్నీ ఫోటోలను అనుష్క సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వాటి క్యూట్ అని క్యాప్షన్ ఇచ్చింది.  

క్రీజ్‌లో విరాట్ కోహ్లీ దిగితే.. అంత ఈజీగా పెవిలియన్‌కు చేరుకోడు. అలాగే తన కుటుంబం విషయానికి వస్తే వారికి  ఎక్కువ సమయం ఇవ్వడంలో కోహ్లీ ముందుంటాడు. అందుకే రన్‌మెషీన్‌ను కంప్లీట్ ఫ్యామిలీ మెన్‌ అంటారు.  

విరాట్ కోహ్లీకి సంబంధించిన ఫన్నీ ఫోటోలను అనుష్క సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటికి క్యూట్ అని క్యాప్షన్ ఇచ్చింది.

"నా ప్రియసఖి.. ఇది నీ పుట్టినరోజు. నీలోని బెస్ట్ యాంగిల్స్‌ను చూపించే ఫొటోలను షేర్ చేస్తున్నా. నేను నిన్ను ప్రతి స్థాయిలో ప్రేమిస్తున్నాను" అని అనుష్క శర్మ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.  

విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా అభిమానులు విషెస్ చెబుతూ సోషల్ మీడియాను మర్మోగిస్తున్నారు. మీరు ఈ ఫొటోలను షేర్ చేసి కోహ్లీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link