Nandamuri Balakrishna: హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విజయం.. ఏపీలో కూటమి ఊచకోత..
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు అధికార వైసీపీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. కూటమి పార్టీ ఏపీలో పాగా వేసింది. ఇక అధికారంలో ఉన్న వైసీపీకి ప్రజలు కేవలం పదిస్థానాలను మాత్రమే కట్టబెట్టారు. మంత్రులు, కీలక నేతలు చిత్తు చిత్తుగా ఓడిపోవడం ప్రస్తుతం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగా.. దేశ ప్రధాని మోదీ సైతం చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ విషేస్ చెప్పారు. ఇక కేంద్రంలో బీజేపీకి అనుకున్న సీట్లు సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు సపోర్ట్ ఇప్పుడు బీజీపీకి కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమిత్ షా.. చంద్రబాబుకు ఫోన్ చేసి ఎన్డీయే కన్వీనర్ పదవి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందుపురం నియోజక వర్గం కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. 1985లో టీడీపీ పార్టీనీ స్థాపించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1994లోనూ ఎన్టీఆర్ హిందూపురం నుంచి విజయబావుటా ఎగిరేశారు. 1996 ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ, 1999లో సీసీ వెంకట్రాముడు, 2004లో పామిశెట్టి రంగనాయకులు, 2009లో అబ్దుల్ ఘనీ వరుసగా విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో రిటైర్డ్ పోలీస్ అధికారి షేక్ మహమ్మద్ ఇక్బాల్‌పై బరిలో దిగారు. ఈ ఎన్నికలలో.. బాలకృష్ణ 17 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. అదే విధంగా..2014లో నందమూరి బాలకృష్ణ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ విజయం సాధించారు. ఈ ఎన్నికలలో.. 16,196 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014 లో బాలయ్య.. 81,543 ఓట్ల మెజారీటీ, 2019 లో 91,704 ఓట్ల మెజార్టీతో బాలయ్య విజయంసాధించిన విషయం తెలిసిందే.
హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ 2014, 2019, 2024 ఎన్నికల్లో అభ్యర్థుల్ని మార్చేసింది. 2014 ఎన్నికల్లో నవీన్ నిశ్చల్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి బాలయ్య చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మాజీ పోలీస్ అధికారి ఇక్భాల్ వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేయగా.. ఆయన కూడా బాలయ్య చేతిలో ఓటమిపాలయ్యారు.
2024 లో.. ఈసారి మహిళా అభ్యర్థి దీపికను వైఎస్సార్‌సీపీ బరిలోకి దింపింది.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సాధించారు. ఇదివరకు రెండు సార్లు గెలుపొందిన ఆయన మూడోసారి 31,602 ఓట్ల మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధించారు.