Pawan Kalyan: వామ్మో.. పవన్ కళ్యాణ్ కొన్న 3.52 ఎకరాల స్థలం అంత కాస్లీనా.. ?.. ధరలు తెలిస్తే షాక్ అవుతారు..
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలను తన స్పీడ్ ను పెంచారు. ఇటీవల తనకు కేటాయించిన అన్నిశాఖాలతో వరుసగా భేటీ అవుతున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు మీటింగ్ లు నిర్వహించి ప్రజాసమస్యలు తీర్చేందుకు అధికారులు ఎల్లవేళలా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇటీవల కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. తన ఇష్టమైన ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ రావడంతో ఇటు జనసేన కార్యకర్తలు, అటు పవన్ అభిమానులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు.
ఇటీవల ఏపీలో తొమ్మిదినెలల క్రితం తప్పిపోయిన యువతి ఘటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. పోలీసులకు స్పెషల్ ఆదేశాలు జారీ చేసి, కేవలం తొమ్మిదిరోజుల వ్యవధిలో యువతి ఆచూకీని గుర్తించి, వారి కుటుంబం వద్దకు యువతిని చేర్చారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇటీవల పిఠాపురంలో కొంత భూమిని కొనుగోలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని 4 అంతస్థుల భవనం కొనుగోలు చేసిన పవన్.. దాన్ని కార్యాలయంగా వాడుకుంటున్నారు.
మరోవైపు పిఠాపురంలో సొంతిళ్లు కట్టుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాల రెండు బిట్లు తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా పూర్తయింది. ఇందులో రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని, పిఠాపురంలో పవన్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలుస్తోంది.
ప్రస్తుతం పిఠాపురంలో ఎకరం భూమి 15 నుంచి 16 లక్షల వరకు ఉందని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం ఇలాఖా, అంతేకాకుండా.. పిఠాపురం కూడా ఇప్పుడు అన్నిరకాలుగా డెవలప్ మెంట్ లో ముందకు దూసుకుపోతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో పిఠాపురంలో భూములను కొనుగోలు చేయడానికి చాలా మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి భూములు, ఇళ్ల ధరలకు ఇప్పుడు డిమాండ్ ఉందని కూడా ప్రచారం జరుగుతుంది.