Pawan Kalyan: పవన్.. ఆ హీరోయిన్ కు రూ. 24 లక్షల విలువ చేసే నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడా.. ? మైండ్ బ్లాంక్ చేస్తోన్న న్యూస్..!

Wed, 09 Oct 2024-12:44 pm,

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే ఓ పేరు కాదు.. ఓ తుఫాను.. ఇది చెప్పింది ఎవరో కాదు.. సాక్షాత్తు మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు.

అప్పట్లో హిట్ కోసం దాదాపు 10 యేళ్లు వెయిట్ చేసిన పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో బ్లాక్ బస్టర్ కోసం దాదాపు అంత కంటే ఎక్కువ టైమే వెయిట్ చేసాడు. అందకు తగ్గ ఫలితం అందుకున్నాడు. అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా ఎన్టీయే ప్రభుత్వంలో కీ రోల్ పోషించి అసలు సిసలు ‘గేమ్ ఛేంజర్’గా నిలిచాడు.

అంతేకాదు 2024 ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇప్పటికే తాను ఒప్పుకున్న  సినిమాలను పూర్తి చేసే  పనిలో ఉన్నారు.

అంతేకాదు సనాతన ధర్మ పరిరక్షణ కోసం రంగంలోకి దిగారు. ఆ సంగతి పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ హీరోగా పీక్స్ లో ఉన్న సమయంలో ఓ హీరోయిన్ కు దాదాపు పాతిక లక్షల విలువ చేసే ఓ నెక్లెస్ ను గిఫ్ట్ గా ఇచ్చాడనే వార్త హల్ చల్ చేస్తుంది.

 

ఆమె ఎవరో కాదు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కన ‘జల్సా’ లో నటించిన పార్వతి మెల్టన్ కు అప్పట్లో పెద్ద నజరానా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

కానీ ఆ విషయంలో ఎలాంటి వాస్తవం లేదని అభిమానులు చెబుతున్నారు. మరి ఈ పుకారు ఎందుకు బయటకు వచ్చిందో పుట్టించిన వాళ్లకే తెలియాలి.

పార్వతి మెల్టన్ విషయానికొస్తే.. ఆమె 2005లో వచ్చిన ‘వెన్నెల’ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. అందులో భాగంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘జల్సా’ సినిమాలో హీరో ప్రియురాలి పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా పెళ్లై యూఎస్ లో సెటిల్ అయినట్టు సమాచారం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link