Teachers Transfers Rules: టీచర్ల బదిలీలు ఎలానో తెలుసా.. ఈ పాయింట్ల ఆధారంగానే నిర్ణయం
![Teachers Transfers Rules](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/TeachersTransfersRules_1.jpg)
పీఈటీ టీచర్లకు క్రీడాంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. క్రీడా పోటీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో వారి విద్యార్థులు పాల్గొన్నారా..? అవార్థులు సాధించారా..? అనే ప్రాతిపదికన పాయింట్లు కేటాయిస్తారు.
![Teachers Transfers](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/TeachersTransfersRules1_0.jpg)
నేషనల్ లెవల్‌లో పాల్గొనే స్థాయికి తీసుకువెళ్తే రెండు పాయింట్లు లభిస్తాయి. అవార్డు సాధిస్తే.. మూడు పాయింట్లు కేటాయిస్తారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు.
![Teachers Transfers in AP](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/TeachersTransfersRules2_0.jpg)
సైన్స్ ఉపాధ్యాయులకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్లను ప్రామాణికంగా తీసుకుంటారు. విద్యార్థుల ఎన్ని ప్రాజెక్టులు ప్రద ర్శించారు? వాటికి ఎలాంటి ప్రశంస లభించింది? అనేది ఆధారంగా పాయింట్లు ఇస్తారు.
సోషల్ టీచర్లకు క్విజ్లు, జనరల్ నాలెడ్జ్ పోటీలను ప్రామాణికంగా చూస్తారు. హిందీ ఉపాధ్యాయులకు విద్యార్థులు మాధ్యమిక వంటి పరీక్షలు రాశారా..? వారి ప్రతిభ ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. గణిత టీచర్లకు విద్యార్థులను ఒలంపియాడ్ వంటి పోటీల్లో పాల్గొనే స్థాయికి తీసుకువెళ్లారా..? బహుమతులు ఏమైనా అందుకున్నారా..? అనే విషయాన్ని చెక్ చేస్తారు.
ఇంగ్లిష్ టీచర్లకు స్పెల్ బీ పోటీలు, ఇతరత్రా ఆంగ్ల సంబంధిత పోటీల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. తెలుగు టీచర్లకు కూడా కొన్ని అంశాలను పెట్టే యోచనలో ఉన్నారు. ఇలా ప్రతి సబ్జెక్ట్‌లో పాయింట్ల ఆధారంగా బదిలీలను చేపట్టనున్నారు.