Chandrababu naidu: నక్క తోక తొక్కిన చంద్రబాబు.. ఇద్దరు మాజీ సీఎంలు కన్న ఆ కలలను సాధించిన టీడీపీ దళపతి..

Fri, 07 Jun 2024-8:37 pm,

దేశంలో జరిగిన ఎన్నికలు చరిత్రలో నిలిచిపోయే విధంగా మారాయని చెప్పుకొవచ్చు. ప్రజలు ఈసారి ఎన్నికల ఫలితాలను వినూత్నంగా ఇచ్చారు. ఒకవైపు దేశంలో చార్ సో పార్ అన్న మోదీకి షాక్ ఇచ్చారు. ఇటు ఏపీలో వైనాట్ 175 అన్న జగన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మరీ ఘోరంగా మారిందని చెప్పుకొచ్చు. కేంద్రంలో మోదీ అధికారంను నిలబెట్టుకునేందుకు ఇతర పార్టీల మీద ఆధార పడాల్సి వచ్చింది. ఒకప్పుడు కనీసం ఢిల్లీకీ వెళ్తే కనీసం అపాయింట్ ఇవ్వని బీజేపీ పెద్దలు.. ఇప్పుడు చంద్రబాబును మోదీ పక్కన సీటులో కూర్చుండపెట్టడం దేశంలో హట్ టాపిక్ గా మారింది.

ప్రధానంగా గతంలో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అదే విధంగా ఏపీలో మాజీ సీఎం జగన్ అచ్చం ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూశారు. గులాబీ బాస్ అధికారంలో ఉన్నప్పుడు బీహర్ , మహారాష్ట్రలను చుట్టేశారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి అటు మోదీ, ఇటు ఇండియాకూటమికి ఝలక్ ఇద్దామని ప్లాన్ లు  చేశారు. కాలుకు బొంగరం కట్టుకుని మరీ పలు రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యారు.   

అంతేకాకుండా.. ప్రతి సమావేశంలోను దేశ్ కీ నేత.. ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికారు. ఇక తాను కూడా ఏకంగా ప్రధాన మంత్రి రేసులో ఉన్నట్లు ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ అనూహ్యంగా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బొక్కా బొర్లా పడ్డారు. 

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కనీసం ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ గెలువలేకపోయింది. మరోవైపు ఏపీ మాజీ సీఎం జగన్ కూడా కేంద్రంలో మోదీకి తక్కువ సీట్లు వస్తే.. మనమీద ఆధారపడతారు. అలాంటి సందర్భంలోవాళ్ల ముందు మనం ప్రత్యేక హోదా, పోలవరం వంటి అన్ని అంశాలను ఢిల్లీ పెద్దల మెడలు వంచి సాధించుకొవచ్చని కలలు కన్నారు.

కానీ ఈ రెండు అవకాశాలు కూడా అనూహ్యంగా నక్కతొక్క తొక్కనట్లు ఏపీలో కూటమిగా ఎన్నికల బరిలో దిగి భారీగా సీట్లు సాధించారు. ఎగ్జిట్ పోల్ అంచనాలకు పూర్తిగా భిన్నంగా.. టీడీపీ- బీజేపీ-జనసేన కూటమి సంచలనం సృష్టించింది. ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించడం గొప్ప మలుపుగా చెప్పుకొవచ్చు. టీడీపీ 144కు గానూ 135, జనసేన 21కి 21, బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది.

దీంతో ఢిల్లీలో చంద్రబాబు ప్రస్తుతం కింగ్ మేకర్ గా మారారు. ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీ 240 సీట్ల వద్దే ఆగిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ మ్యాజిక్ ఫిగర్ 272. దీంతో బీజేపీ తన మిత్ర పక్ష పార్టీలపై ఆధార పడాల్సి వచ్చింది. ఈక్రమంలో టీడీపీ మోదీ ప్రభుత్వంలో ఏర్పాటులో కింగ్ మేకర్ గా మారారు. 

అంతేకాకుండా... ఇటు టీడీపీ 16 స్థానాలు, జేడీయూ 12 సీట్లు మోదీ సర్కారు ఏర్పాటుకు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలోని గులాబీ బాస్, ఏపీ మాజీ సీఎం జగన్ కన్న కలలను.. చంద్రబాబు సాకారం చేసుకోగలిగారు. చంద్రబాబుకు, జనసేన పవన్ కళ్యాణ్ కు మోదీ క్యాబినేట్ లో కీలక పోస్టులు దక్కవచ్చని కూడా ప్రచారం జరుగుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link