Apple 13 Price Drop: అమెజాన్‌లో Apple 13 పై ఊహించని డిస్కౌంట్.. ఎగబడి మరీ కొంటున్న జనాలు!

Sun, 11 Aug 2024-3:35 pm,

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా అన్ని మొబైల్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్ లో భాగంగా యాపిల్ బ్రాండ్ కు సంబంధించిన కొన్ని మొబైల్స్ పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది.   

ముఖ్యంగా గతంలో లాంచ్ అయిన యాపిల్ 13 (Apple 13) మొబైల్ పై అత్యధికమైన తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ కు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. 

మార్కెట్లో యాపిల్ 13 (Apple 13) స్మార్ట్ ఫోన్ మొత్తం ఆరు  కలర్స్లో అందుబాటులో ఉంది. దీంతోపాటు మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని బేస్ స్టోరేజ్ వేరియంట్ కలిగిన మొబైల్ పై ప్రత్యేకమైన ఆఫర్ నడుస్తోంది. 

256 ఇంటర్నల్ స్టోరేజీ కలిగిన ఈ యాపిల్ 13 స్మార్ట్ ఫోన్ పై వివిధ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ ను ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఆమెజాన్ 15% ఫ్లాట్ తగ్గింపునందిస్తోంది. 

ప్రస్తుతం మార్కెట్లో ఈ యాపిల్ 13 (Apple 13) స్మార్ట్ ఫోన్ ధర రూ.69,900 కాగా ప్రత్యేకమైన ఆఫర్స్ లో 15% తగ్గింపుతో కేవలం రూ. 59,300కే అందుబాటులో ఉంది. అలాగే మరింత తగ్గింపు పొందడానికి ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.   

ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఇతర బ్యాంకులకు సంబంధించిన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బ్యాంక్ ఆఫర్ పోను రూ. 58,300కే లభిస్తుంది.  

అలాగే అదనంగా భారీ తగ్గింపు పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ను పొందడానికి పాత యాపిల్ ఫోన్ తప్పకుండా మీరు వినియోగిస్తున్న పాత కండిషన్ కలిగిన మొబైల్ ను ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. 

ఇలా ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.54,900 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను ఈ యాపిల్ 13 (Apple 13) కేవలం రూ.4,400కే పొందవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link