iPhone 16 Launch: మరోసారి లీక్ అయిన ఐఫోన్ 16 ఫీచర్లు, ఐఫోన్ 15కు పూర్తిగా భిన్నంగా ఉంటుందా

ఐపోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రెండింటిలో ఆప్టికల్ జూమ్ కెమేరా సెటప్ ఉంటుంది. ఈ రెండు ఫోన్లు మెయిన్ కెమేరాతో సమానంగా 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటాయి. సెల్ఫీ కోసం మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది.

ఐఫోన్ 16 ప్రో 6.3 ఇంచెస్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఐపోన్ 16 ప్రో మాత్రం 6.9 ఇంచెస్ స్క్రీన్ తో ఉంటుంది. ఐఫోన్ వివిధ మోడళ్లలో ఇదే లార్జర్ స్క్రీన్.

ఐఫోన్ 16 యూఎస్ బి సి టైప్ పోర్ట్ కలిగి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో రానుంది. గత మోడల్ ఐఫోన్ 15 ప్రోలో ఉండే ఫీచర్లు ఈసారి ఐఫోన్ 16 బేసిక్ వేరియంట్ లో కూడా ఉంటాయి. ఇందులో ఎ18 చిప్ సెట్ ఉంటుంది.
ఐఫోన్ 16లో కెమేరా సెటప్ వర్టికల్ డ్యూయల్ కెమేరాతో ఉంటుంది. 3డి వీడియా రికార్డింగ్ ఉంటుంది. కొత్తగా క్యాప్చర్ బటన్, యాక్షన్ బటన్ ఐఫోన్ 16లో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.