Sankranti: సంక్రాంతికి ఊరెళ్లేవారికి బంపర్‌ గుడ్‌న్యూస్‌.. బస్సు ఛార్జీలో 10 శాతం రాయితీ..!

Tue, 07 Jan 2025-5:12 pm,

సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ 7200 ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. రేపటి నుంచి 13 వ తేదీ వరకు 3900 స్పెషల్‌ బస్సులు, ఇందులో 2153 హైదరాబాద్‌ నుంచి అందుబాటులో ఉండనున్నాయి. బెంగళూరు నుంచి 375 బస్సులు తిరగనున్నాయి.  

అంతేకాదు ఈ బస్సులు తిరుగు ప్రయాణానికి 3200 ప్రత్యేక బస్సులు నడపనుంది. అయితే, ఈ బస్సులు సంక్రాంతి సందర్భంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. సంక్రాంతికి రానూ పోనూ బస్సు టిక్కెట్లు బుక్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ కూడా పొందుతారు.  

సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ ఏ ఊళ్లో ఉన్న సొంత ఊరికి చేరుకుంటారు. సంక్రాంతి పండుగు ముఖ్యంగా ఏపీలో వైభవంగా జరుపుకుంటారు. పిల్లాపెద్దా అందరూ కలిసి ఈ పండుగ జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ మూడు రోజులు నిర్వహిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు నిర్వహిస్తారు.  

ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ పండుగ కోసం అంతా ఎదురు చూస్తుంటారు. రంగురంగుల ముగ్గులు, కోళ్ల పందెం వంటివి నిర్వహిస్తారు. ఇప్పటికే స్కూళ్లకు కూడా శుక్రవారం నుంచి సెలవులు ఇచ్చారు. దాదాపు పది రోజులపాటు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఈ పండుగకు కచ్చితంగా ఊరుకు వెళ్తారని ప్రైవేటు ట్రావేల్స్‌ వారు ఛార్జీలు పెంచుతారు.  

ఈ సందర్భంగా ఏపీఎస్‌ఆర్‌టీసీ తీపి కబురు అందించింది.  10 శాతం రాయితీ ఇవ్వడంతో సామాన్యులకు భారీ ఊరట అందినట్లయింది. ఇక స్కూళ్లు కూడా తిరిగి జనవరి 20 వ తేదీకి తెరుచుకుంటున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link