AR Rahman divorce: తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన ఏఆర్ రెహమాన్ పిల్లలు.. ఏమన్నారంటే..?

ఫెమస్ మ్యూజీక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ విడాకులు అంశం ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తుంది. కొంత మంది ఏఆర్ రహమాన్ తీరును తప్పుబడుతుంటే.. మరికొందరు ఆయనకు సపోర్ట్ గా ఉంటున్నారు.

ఏఆర్ రెహమాన్ అనేక భాషల్లో వందల సినిమాలకు మ్యూజీక్ ను అందించారు .అంతే కాకుండా ఆస్కార్ అవార్డును సైతం గెల్చుకున్నారు. అలాంటి టాలెంట్ ఉన్న ఒక వ్యక్తి ఇలా చేస్తాడనుకోలేదని నెటిజన్లు బాధపడుతున్నారంట.

ఇదిలా ఉండగా.. ఏఆర్ రెహమాన్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన సతీమని సైరా భాను తరపు లాయర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో 29 ఏళ్ల వీరి వివాహ బంధానికి పుల్ స్టాప్ పడినట్లు తెలుస్తొంది.
అంతే కాకుండా.. సైరా భాను.. తము ఈ నిర్ణయం తీసుకొవడం వెనుక అనేక అంశాలున్నాయని, అన్నింటిని చెప్పుకోలేమని, తమ జీవితంలో అనేక అఘాతాలు ఉన్నాయని, అవి పరిష్కారం అవుతాయని అనుకోవట్లేదని కూడా సైరా భాను అన్నారంట.
అలాంటి పరిస్థితుల్లో కలిసి గొడవలు పడే కన్న.. విడిపోయి ప్రశాంతంగా ఉండటం బెటర్ అనుకున్నట్లు కూడా.. రెహమాన్ సతీమణి అన్నారంట. అయితే.. ఏఆర్ రెహమాన్ కు, సైరాకు 1995 లో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. రహీమా, ఖతీజా, అమీన్ లు
ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ సంతానం ఎక్స్ లో పెట్టిన పోస్టులు వార్తలలో నిలిచాయి. తమ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం తమను కూడా బాధించిందని.. అదే క్రమంలో ఈ నిర్ణయంపై గౌవరించినందుకు ధన్యవాదాలు అని చెప్తునే.. మరో వైపు ఇలాంటి కష్టపరిస్థితుల్లో తమను అర్థం చేసుకున్నందుకు కూడా.. థ్యాంక్స్ అంటూ ఎక్స్ లో పోస్ట్ లు పెట్టినట్లు తెలుస్తొంది.