Divorce Celebrity Couples: ఏఆర్ రెహమాన్, నాగ చైతన్య సహా ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు..
ఏఆర్ రెహమాన్ - సైరా..
తాజాగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాకు తలాక్ ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు 29 యేళ్ల వివాహా బంధానికి ముగింపు పలికారు.
జీవీ ప్రకాష్ - సైంధవి..
రెహమాన్ కంటే ముందు ఆయన మేనల్లుడు ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సైంధవి దంపతులు కూడా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే కదా.
నిహారిక - చైతన్య జొన్నలగడ్డ..
మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ ఇద్దరు మనస్పర్థల కారణంగా విడిపోయారు. వీరిద్దరి పెళ్లితోపాటు డైవోర్స్ ఇష్యూ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
సమంత - నాగ చైతన్య..
నాగ చైతన్య, సమంతల మ్యారేజ్ ఎంత గ్రాండ్ గా జరిగిందో.. వీరిద్దరి విడాకుల వ్యవహారం కూడా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే కదా.
ధనుశ్ - ఐశ్వర్య..
రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య, ధనుశ్ కూడా ఎన్నో ఏళ్ల వైవాహాకి బంధాన్ని విడాకులతో ముగింపు పలికారు.
మంచు మనోజ్..
మంచు మనోజ్, ప్రణతి రెడ్డిల వివాహాం బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత మంచు మనోజ్.. భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహాం చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది రెండో వివాహాం కావడం గమనార్హం.
నాగార్జున - లక్ష్మి..
నాగ చైతన్య అమ్మనాన్నలైన నాగార్జున, లక్ష్మిలు కూడా అప్పట్లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. అమ్మ లక్ష్మికి విడాకులు ఇచ్చిన తర్వాతే అమలను పెళ్లి చేసుకున్నారు నాగార్జున. అటు లక్ష్మీ కూడా శరత్ అనే ఆయనను మ్యారేజ్ చేసుకుంది.
పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ - నందిని.. పవన్ కళ్యాణ్ తన మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన తర్వాత రేణు దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు.