AR Rahman Divorce: 29 ఏళ్ల బంధానికి బ్రేకప్.. భర్తతో విడాకులు ప్రకటించిన ఏఆర్ రెహామాన్ భార్య.. కారణం ఏంటంటే..?
ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రీటీలు తరచుగా వార్తలలో ఉంటున్నారు. మెయిన్ గా వారి వైవాహిక జీవితం పెళ్లి, ప్రేమ, విడాకులు అన్న అంశాలతో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు.
ఈ మధ్యకాలంలో మూవీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది దంపతులు విడాకులు తీసుకున్న ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఈ కోవలోకి మ్యూజీక్ మాస్ట్రో ఏఆర్ రెహామన్ దంపతులు కూడా చేరిపోయారు.
మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు.. సైరా తరపున లాయర్.. వందనా షా.. వీరి నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తొంది.
కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు పీక్స్ కు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు కూడా.. 29 ఏళ్ల తమ వివాహా బంధానికి ముగింపు పలకాలని భావించారంట. ఈ క్రమంలో.. ఏఆర్ రెహామాన్ ఎమోషన్ అయినట్లు తెలుస్తొంది.
తమ మధ్య ఏర్పడిన అగాథం సమసి పోదని, అందుకే విడిపొవడానికి రెడీ అయిపోయినట్లు తెలిపారు. ఈ కష్టకాలంలో తమ ప్రైవసీని గౌరవించాలని, అండగా ఉండాలని కూడా ఏఆర్ రెహమాన్ అభ్యర్థించినట్లు తెలుస్తొంది.
మరోవైపు.. రెహమాన్ 1995లో సైరాను వివాహం చేసుకున్నారు. రెహామాన్ తల్లి ఈ సంబధాన్ని చూసి..అప్పట్లో ఓకే చెప్పారని తెలుస్తొంది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు - ఇద్దరు కుమార్తెలు, ఖతీజా, రహీమా, అమీన్ రెహమాన్ అనే కొడుకు. వీరి డైవర్స్ అనౌన్స్ మెంట్ తో అభిమానులు ఒక్కసారిగా మనోవేదనకు గురౌతున్నారంట.