Marriage dates: ఈ తేదీల్లో పెళ్లి చేసుకుంటున్నారా.. విడాకులు తప్పవ్..!
పెళ్లంటే నూరేళ్ల పంట. ముఖ్యంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని చెబుతారు. అందుకే పెళ్లి జరిగేటప్పుడు కూడా ఆచితూచి వధువు, వరుడు జాతకాలను పరిశీలించిన తర్వాతనే పెళ్లి తేదీలను ఫిక్స్ చేస్తారు పండితులు. అయితే ఇప్పుడు చెప్పబోయే తేదీలలో మాత్రం పెళ్లి జరిగితే విడాకులు తప్పవు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రత్యేకించి కొన్ని తేదీలలో పెళ్లి చేసుకుంటే వారి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడుతుందట. అంతేకాదు భార్య, భర్త మధ్య సఖ్యత లేక విడాకుల వరకు వెళ్తారని సమాచారం.
న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీలలో పెళ్లి చేసుకోవడం అంత మంచిది కాదట. సంఖ్యల ప్రకారం ఆ తేదీ చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా 4,13, 22, 31 తేదీలలో వివాహం చేసుకున్న వారికి జీవితంలో ఎక్కువ సమస్యలు ఎదురవుతాయని సమాచారం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ తేదీలలో వివాహం చేసుకున్నవారు నాలుగు సంవత్సరాలలోపే విడిపోయే అవకాశం ఉందట. రిలేషన్ షిప్ లో ప్రేమ, సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కొన్ని సమస్యల వల్ల బంధం దెబ్బ తినే అవకాశం ఉందని సమాచారం.
కాబట్టి దయచేసి వివాహ ముహూర్తాలు చూసుకునేటప్పుడు ఈ నాలుగు తేదీలు లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ నాలుగు తేదీలలో వివాహం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయట.