New Smartphones: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా ? ఐతే ఈ డీటేల్స్ మీ కోసమే

Sat, 26 Feb 2022-4:08 pm,

Vivo V23e 5G

ఈ స్మార్ట్‌ఫోన్ ధర 25 వేల 990 రూపాయలు. 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరాతో అద్భుతంగా ఉంది. 6ఎన్ఎమ్ మీడియా‌టెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌తో..8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యంతో ఉంది. మరో 2 జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు.

Samsung Galaxy A03

ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో 10 వేల 499 రూపాయలకు లభిస్తోంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ కలిగి ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ఫోన్‌గా వచ్చింది. మరో వేరియంట్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. 

Realme Narzo 50

ఈ ఫోన్ ఇండియాలో రెండు ర్యామ్ కెపాసిటీలతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అయితే 12 వేల 999 రూపాయలుగా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అయితే 15 వేల 499 రూపాయలుగా ఉంది. 

Oppo Find X5 Pro

ఒప్పో లాంచ్ చేసిన ఈ మోడల్ ఫోన్ ఇంకా ఇండియాలో లాంచ్ కావల్సి ఉంది. దీని ధర 1299 యూరోలు కాగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 5 మాత్రం 999 యూరోలుగా ఉంది. గ్లేజ్ బ్లాక్, సిరామిక్ వైట్ రంగుల్లో ప్రపంచ మార్కెట్లో లభిస్తోంది. 

Motorola Edge 30 Pro

ఈ స్మార్ట్‌ఫోన్ ధర 49 వేల 999 రూపాయలుగా ఉంది. మార్చ్ 4 నుంచి ఈ ఫోన్ అందుబాటులో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌పై లభ్యం కానుంది. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తోంది. 

Iqoo 9

ఐక్యూ 9 ప్రో, ఐక్యూ 9, ఐక్యూ 9 ఎస్ఈ వేరియంట్ స్మార్ట్‌ఫోన్లు 4 ఎన్ఎం స్నాప్ డ్రాగన్తో 8వ జనరేషన్ చిప్‌సెట్ కలిగి ఉంది. 12 జీబీ ర్యామ్ దీని ప్రత్యేకత. ఈ స్మార్ట్‌ఫోన్  8 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ధర 64 వేల 990 రూపాయలుగా ఉంది. అదే 12 జీబీతో 69 వేల 990 రూపాయలుగా ఉంది. ఇక ఐక్యూ 9 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 42 వేల 990 రూపాయలు కాగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అయితే 46 వేల 990 రూపాయలుగా ఉంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link