AC Blast: మీరు 24 గంటలు ఏసీ నడుపుతున్నారా? పేలుతుంది ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఏసీలు ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలి. ఆ తర్వాతే వాడాలి. ఏసీలు ఇలా పేలడానికి ప్రధాన కారణం అవి వేడెక్కడం. అవును ఈ మండుతున్న ఎండలకు ఏసీలు నిరంతరం నడుస్తుంటాయి. అలా కాకుండా అప్పుడప్పుడు ఏసీలు ఆఫ్ చేస్తూ ఉండాలి.
ఓల్టేజీ తక్కువైతే కూడా ఏసీలు పేలిపోతాయి. అందుకే పవర్ హెచ్చతగ్గులు ఉన్నప్పుడు ఏసీలు ఆఫ్ చేయాలి. అస్సలు నడపకూడదు. అంతేకాదు ఏసీలు పేలడానికి మరో ప్రధాన కారణం కంప్రెసర్‌లో లీకేజీ దీంతో ఏసీ బ్లాస్ట్ అవుతుంది. దీన్ని చెక్ చేస్తూ ఉండాలి.
ప్రతి ఏడాది ఎండకాలం ప్రారంభం ముందే ఏసీలను సర్వీసింగ్ చేయించాలి. వీలైతే కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఏసీ సర్వీసింగ్ చేయించాలి. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఏసీలో వచ్చే వల్ల పెద్ద సమస్యల నుంచి బయటపడవచ్చు.
ముఖ్యంగా మనదేశంలోని వివిధ నగరాల్లో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఈ సమయంలో ప్రజలు ఎక్కువ శాతం ఏసీలు, కూలర్ల పై ఆధారపడాల్సి వస్తోంది..ఇళ్లలో 24 గంటలూ ఏసీ నడుపుతుంటారు. ఇది కూడా ఏసీ బ్లాస్ట్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ ఏసీ కొనుగోలు చేసినట్లయితే దాన్ని ముందుగా సరిగ్గా చార్జింగ్ చేసిన తర్వాతే ఏసీని కొనుగోలు చేయాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )