Turtle Ring: తాబేలు ఉంగరం ఈ రాశివారు పొరపాటున కూడా ధరించకూడదు.. ఇందులో మీ రాశి ఉందా?

Thu, 20 Jun 2024-10:56 am,

అయితే, తాబేలు ఉంగరం అందరూ ధరించకూడదు. ముఖ్యంగా కొన్ని రాశులవారు తాబేలు ఉంగరం అస్సలు ధరించకూడదు. దీంతో వారికి నెగిటివ్‌ ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు తాబేలు ఉంగరాన్ని కేవలం వెండి లోహంతో మాత్రమే ధరించాలి. ఏ రాశులవారు తాబేలు ఉంగరం ధరించకూడదో తెలుసుకుందాం.  

మేషరాశి.. ముఖ్యంగా మేషరాశివారు తాబేలు ఉంగరం ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఈ రాశివారిని తీవ్రంగా ఆర్థిక నష్టాలు వెంటాడుతాయి. అంతేకాదు ఈ ఉంగరం ధరిస్తే ప్రతి పని కూడా చెడిపోతుంది. అయితే, పండితులను సంప్రదించి ఏ ఉంగరం ధరించాలో ముందుగానే తెలుసుకోవాలి.

కన్యరాశి.. జోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలు ఉంగరాన్ని కన్య రాశివారు కూడా ధరించకూడదు. ముఖ్యంగా ఈ రాశివారు తాబేలు ఉంగరం ధరిస్తే అతిగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒంట్లో చలువ కూడా పెరుగుతుంది. ఈ రాశివారు తాబేలు ఉంగరానికి దూరంగా ఉండాలి.

వృశ్చిక రాశి.. వృశ్చిక రాశివారికి కూడా తాబేలు ఉంగరం కలిసి రాదు. దీని వల్ల అశుభ ఫలితాలు పొందుతారు వృశ్చికరాశివారు తాబేలు ఉంగరం ధరిస్తే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం. అయితే ఏ ఉంగరం ధరించిన ముందుగా జ్యోతిష్యుని సలహాలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. లేకపోతే అది నెగిటివిటీని తీసుకువస్తుంది.

మీనం.. మీన రాశివారు కూడా తాబేలు ఉంగరం ధరించకూడదు. వీళ్లు కూడా తాబేలు ఉంగరం ధరించడం వల్ల కూడా ఆర్థికంగా నష్టపోతారు. అయితే, ఈ ఉంగరం ధరిస్తే మీన రాశివారికి శ్రేయస్కరం కాదు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link