Ashika Ranganath: గ్లామర్ డోస్ పెంచిన ఆషికా.. బ్లాక్ డ్రెస్సులో మైండ్ బ్లాక్

Tue, 21 May 2024-3:47 pm,

కళ్యాణ్ రామ్ అమిగో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ ఆషికా రంగనాథ్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోయినా.. ఈ హీరోయిన్ నటించిన ఎన్నో రాత్రులు వస్తాయని పాతకి మాత్రం మంచి స్పందన వచ్చింది.  

కాగా ఆషికా రెండో సినిమా తెలుగులో నాగార్జునతో చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఈ సంక్రాంతికి విడుదలైన నా సామిరంగా సినిమాలో వరాలుగా కనిపించింది ఈ హీరోయిన్.

ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర పరవాలేదు అనిపించుకున్న ఆషికా నటనకు మాత్రం వందకు వంద మార్కులు పడ్డాయి. ఈ హీరోయిన్ కి తెలుగులో వరస అవకాశాలు రావడం ఖాయం అనుకున్నారు అందరూ.

అయితే ఈ కర్ణాటక అమ్మాయికి ప్రస్తుతం తెలుగులో మాత్రం అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు. కన్నడ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న ఆషికా తెలుగులో మాత్రం వెనకబడి ఉంది.  

ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link