Akshaya Tritiya 2024: మే 10న అక్షయ తృతీయ.. ఈ నాలుగు రాశులకు అఖండ ధనయోగం..

Sat, 20 Apr 2024-7:19 pm,

హిందు ధర్మ సంప్రదాయం ప్రకారం అక్షయ తృతీయను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజున ఏపనులు చేసిన, ఏ పనులు మొదలు పెట్టిన అది ఆగకుండా, నిర్విఘ్నంగా పూర్తవుతుందని హిందువులు నమ్ముతుంటారు. అందుకే అక్షయ తృతీయను ను ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు.

జ్యోతిష్యశాస్త్రంప్రకారం అక్షయ తృతీయ ప్రభావం వల్ల కొన్ని రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు సంభవించబోతున్నాయి. ముఖ్యంగా వృషభం, కన్య, వృశ్చికం, కుంభం రాశులలో కలలో కూడా ఊహించని మార్పులు సంభవించబోతున్నట్లు పండితులు చెబుతున్నారు. 

వృషభం: ఈ రాశివారికి ముఖ్యంగా అనుకూల శుక్రగ్రహం ప్రభావం వల్ల ఏపని చేసిన కూడా నిర్విఘ్నంగా పూర్తిఅయిపోతుంది. ముఖ్యంగా వీరు అక్షయ తృతీయ రోజున కొత్త పనులను ప్రారంభించడం ఎంతో మంచిది. గురువింద గింజ అయిన బంగారం కొంటే అది జీవితాంతం వరకు కూడా కలసి వస్తుంది.

కన్య: కన్య రాశి వారు గతంలో చేసిన తప్పులను అస్సలు మరల రిపీట్ చేయకూడదు. ఈ అక్షయ తృతీయ తిథి ప్రభావం వల్ల మీ జీవితంలో ఆకస్మిక ధరలాభం కన్పిస్తుంది. మీరు ఊహించి దాని కంటే ఎక్కువగా డబ్బులు వచ్చిచేరుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి మీకు దక్కే అవకాశం ఉంది.

వృశ్చికం: ఈ రాశి వారు ఎన్నోరోజులనుంచి ఎదురు చూస్తున్న పెళ్లి బజాలు మోగుతాయి. వీరికి భార్యవైపు నుంచి ఆస్తులు కలసి వచ్చే యోగం కన్పిస్తుంది. అందుకే వీరు ఎల్లప్పుడు కూడా ఉత్సాహాంగా ఉంటారు. అక్షయ తృతీయ రోజున కొత్తపనులను ప్రారంభించడం వీరికి చెప్పదగిన సూచనలు  

కుంభం: కుంభ రాశి వారు కోర్టు కేసులలో విజయంసాధిస్తారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు మరల మీ చెంతకు వచ్చి చేరుతుంది. మీకు ఉన్న పొలాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లాభాల పాటపడతాయి. మీకు విదేశీయోగం కూడా ఉంది. కొందరికి డబ్బుల నిధులు కూడా దొరికే చాన్స్ కూడా లేకపోలేదని జ్యోతిష్యలు చెబుతున్నారు.Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link