Grahana yogam: తులా రాశిలో ఏర్పడనున్న గ్రహణ యోగం, రెండ్రోజులు తస్మాత్ జాగ్రత్త
రాహు కేతువులు
జ్యోతిష్యం ప్రకారం ఏదైనా జాతకం కుండలిలో రాహు కేతువుల్లో ఏ ఒక్కటైనా చంద్రునితో కలిసి యుతి ఏర్పరిస్తే గ్రహణ యోగం ఏర్పాటౌతుంది.
మెదడు మస్తిష్కం
గ్రహణ యోగం ప్రభావం మనిషి మస్తిష్కంపై పడుతుంది. ఫలితంగా ఆ వ్యక్తికి ఒత్తిడి, అతి ఆలోచనలు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఏర్పడతాయి.
తులా రాశి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహణ యోగం ప్రభావం చాలా వ్యతిరేకంగా ఉంటుంది. మనిషి ఆందోళనగా ఉంటాడు. గ్రహణ యోగం తులా రాశిలో జూలై 25వ తేదీ మద్యాహ్నం 11 గంటల 13 నిమిషాలకు ఏర్పడనుంది. ఈ ప్రభావం జూలై 27 సాయంత్రం 7 గంటల 28 నిమిషాల వరకూ ఉంటుంది. \
గ్రహణ యోగం
ప్రస్తుతం కేతువు గోచారం తులా రాశిలో జరుగుతోంది. మంగళవారం అంటే ఇవాళ ఈ రాశిలో చంద్రుడు ప్రవేసించాడు. దాంతో తులా రాశిలో గ్రహణ యోగం ఏర్పడింది.