December Graha Gocharam 2022: డిసెంబర్ నెలలో ఈ 4 రాశులవారికి వద్దంటే డబ్బు, ఉద్యోగ, పదోన్నతులు
సింహ రాశి
ప్రతి నెలా కొన్ని గ్రహాల గోచారం ప్రభావం అన్ని రాశులపై శుభంగా లేదా అశుభంగా ఉంటుంది. సింహరాశి జాతకులకు డిసెంబర్ నెల అదృష్టాన్ని తిరగరాయనుంది. ఈ నెలలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఈ సమయంలో వ్యాపారులకు విశేషమైన లాభముంటుంది. ఈ సందర్భంగా కొత్త పనులు ప్రారంభించవచ్చు. ఒకేసారి ధనలాభం కలుగుతుంది.
మిధునరాశి
జ్యోతిష్యశాస్త్రంలో డిసెంబర్ నెల మిధున రాశి జాతకులకు ఓ వరం లాంటిది. ఈ నెల కెరీర్‌లో విజయం లభిస్తుంది. మిదున రాశి వారికి కెరీర్‌పరంగా లాభముంటుంది. వ్యాపారులకు లాభాలు కలుగుతాయి. ఈ నెలలో నిలిచిపోయిన పనులు పూర్తి కానున్నాయి. ఆర్ధికంగా లాభాలు ఆర్జిస్తారు. కుటుంబసభ్యుల మధ్య ప్రేమానురాగాలుంటాయి.
మకర రాశి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మకర రాశి జాతకులకు డిసెంబర్ నెల అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ నెలలో ఈ రాశి జాతకులకు పనిలో, వ్యాపారంలో ధనలాభముంటుంది. సిబ్బంది సహకారం లభిస్తుంది. ఉద్యోగం మారే ఆలోచన ఉంటే. ఈ నెలలో చాలా అవకాశాలు లభిస్తాయి. మొత్తంగా చూస్తే ఈ నెలంతా బాగుంటుంది.
కుంభరాశి
కుంభరాశిలో డిసెంబర్ నెలలో జరగనున్న గ్రహ గోచారం శుభసూచకంగా ఉంటుంది. డిసెంబర్ నెలలో గ్రహాల స్థితి కారణంగా ఉద్యోగస్థులకు బాగుంటుంది. డబ్బులు పెట్టుబడి పెట్టేందుకు ఆలోచిస్తుంటే ఈ నెల అత్యంత అనువైంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. భూమి, ఇళ్లు, వాహనాలు కొనవచ్చు.