Money Investment: అద్భుతమైన పథకం.. రూ.7 ఖర్చుతో రూ.5వేలు లాభం..!

Wed, 21 Aug 2024-12:23 am,

జీవితంలో  వృద్ధాప్య దశకు చేరుకున్నప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా.. ఉండడానికి ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన మరో అద్భుతమైన పథకం అటల్ పెన్షన్ యోజన పథకం కూడా ఒకటి. ఇందులో  ప్రతిరోజు 7 రూపాయలు పెట్టుబడి పెడితే 60 సంవత్సరాలు తర్వాత మీరు మంచి ఆదాయాన్ని పొందుతారు.. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన నెలసరి కూలీ కార్మికుల కోసం ఈ పథకాన్ని  కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 

2015లో ఈ పథకాన్ని తీసుకురాగా , 18 నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు ఉండేవారు ఇందులో చేరవచ్చు.  ఇప్పటివరకు ఈ పథకం ద్వారా  7 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారు.  రోజుకు 7 రూపాయలు అంటే నెలకు 210 రూపాయలు పెట్టుబడి పెట్టాలి.  60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి నెల 5 వేల రూపాయలను పెన్షన్ గా పొందవచ్చు.

రోజుకు 7 రూపాయలు అంటే  నెలకు రూ.210,  3 నెలలకు రూ.626,  ఆరు నెలలకు రూ.1, 239 ఇలా చెల్లించినా  సరే మీరు మంచి ఆదాయం పొందుతారు ఒకవేళ నెలకు ₹1000 పెన్షన్ మాత్రమే పొందాలి అనుకుంటే 18 సంవత్సరాల వయసు నుండి మీరు ప్రతి నెల 42 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 

ఈ పథకంలో చేరిన వారు అకస్మాత్తుగా మరణిస్తే వారి జీవిత భాగస్వామికి పెన్షన్ చెల్లించబడుతుంది. దురదృష్టవశాత్తు ఇద్దరు చనిపోతే చందాదారుని నామినీకి ఆ పెన్షన్ మొత్తం లభిస్తుంది. 

ఈ పథకాన్ని మీరు ప్రభుత్వ,  ప్రైవేటు బ్యాంకులు,  పోస్ట్ ఆఫీస్ లో కూడా ప్రారంభించవచ్చు.. అంతే కాదు ఆన్లైన్ ద్వారా కూడా ఖాతా తెరవవచ్చు. దీనికోసం బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి. ఈ పథకాలలో చేరి డబ్బు ఆదా చేయడం వల్ల భవిష్యత్తులో మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేరు. ముఖ్యంగా వృద్ధాప్యంలో పనిచేయడం కుదరదు. శరీరం సహకరించదు తద్వారా ఉచితంగా డబ్బు వస్తే జీవించాలని ఆలోచిస్తారు.  అలాంటివారు ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఇలాంటి పథకాలలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link