August Bank Holidays: ఆగష్టు నెల బ్యాంకు సెలవుల్లో బిగ్ ట్విస్ట్.. రక్షాబంధన్ కు సెలవు లేనట్టేనా..!
ఆగష్టు నెలలో దేశ వ్యాప్తంగా వివిధ జోన్లలో మొత్తంగా 31 రోజుల్లో 13 రోజులు సెలవులున్నాయి. అందులో 4 ఆదివారాలు, 2 శనివారాలు, పంద్రాగష్టు సెలవుతో పాటు మరో 6 సెలవులు ఉన్నాయి.
ఆగష్టు నెలలో వివిధ రాష్ట్రాల్లో పండగల ప్రాధాన్యత దృష్ట్యా బ్యాంకులకు వివిధ రోజుల్లో సెలవులు ప్రకటించారు. ఆగష్టు 15న దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.
అటు ఆగష్టు 19న రాఖీ పండగ సందర్భంగా సెలవు ప్రకటించారు. కానీ దక్షిణాదిలో కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు సెలవు లేదు. అక్కడ వేరే ముఖ్యమైన రోజున బ్యాంకులకు హాలీడే ప్రకటించారు. .
ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం ఆగష్టు 20 మంగళవారం బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.
ఆగష్టు 24 నాల్గో శనివారం, 25 ఆదివారం, 26 జన్మాష్టమి వరుసగా మూడు రోజులు సెలవులు. కాబట్టి ఆగష్టు నెలలో బ్యాంక్ సెలవులను బట్టి మీ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోండి.