Salman Khan: ప్లీజ్.. మమ్మల్ని వదిలేయ్.. నిందితుల నుంచి ముంబై పోలీసులకు మరో మెస్సెజ్.. షాక్‌లో సల్లు భాయ్..?..
సల్మాన్ ఖాన్ ను బిష్ణోయ్ గ్యాంగ్ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారని చెప్పుకొవచ్చు. ఇప్పటికే ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధీఖీని అత్యంత క్రూరంగా హత మార్చారు. అంతేకాకుండా తర్వాతి టార్గెట్ సల్మాన్ అంటూ కూడా సంకేతాలు సైతం ఇచ్చారు.
బాబా సిద్ధీఖీ మరణం తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతను పెంచుకున్నట్లు తెలుస్తొంది. ఆయన మరో బుల్లెట్ ప్రూఫ్ కారును సైతం కొనుగోలు చేశారు. అంతేకాకుండా.. సల్మాన్ చుట్టు మూడంచెల సెక్యురిటీని సైతం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తొంది.
ఇదిలా ఉండగా.. సల్మాన్ ను ఇటీవల బెదిరిస్తు ముంబై పోలీసులకు అక్టోబరు 18న ఒక వాట్సాప్ వచ్చిన విషయం తెలిసిందే. అందులో తమకు 5 కోట్లిస్తే సల్మాన్ ను వదిలేస్తామన్నారు. అంతే కాకుండా.. బిష్ణోయ్ తెగకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ మెస్సెజ్ ను లైట్ తీసుకుంటే అత్యంత దారుణంగా చంపుతామని కూడా ఆ మెస్సెజ్ లో ఉంది. ఇదిలా ఉండగా.. ముంబై పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఈ వ్యాఖ్యల్ని సల్మాన్ తండ్రి ఖండించాడు. తన కొడుకు జింకలను చంపలేదన్నారు.
చేయని తప్పుకు ఎందుకు సారీ చెప్తారని, ఒక వేళ చెప్తే.. తప్పు ఒప్పుకున్నట్లు అవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో నిందితుల నుంచి ముంబై పోలీసులకు అదే నంబర్ నుంచి ఈరోజు అక్టోబరు 21న మరో సందేశం వచ్చింది. సల్మాన్ ను బెదిరించినందుకు సారీ చెపుతూ అందులో సందేశం ఉంది.
సల్మాన్ ను బెదిరించి తప్పు చేశామని కూడా ముంబై పోలీసులకు అదే నంబర్ నుంచి మెస్సెజ్ పంపించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు జార్ఖండ్ లో ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం దీనిపై పోలీసులు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.