Govt Scheme: పిల్లల పేరిట రోజుకు రూ.18 సేవ్ చేస్తే చాలు.. కేంద్ర ప్రభుత్వ స్కీంతో చేతికి రూ. 6 లక్షలు..!!

Sun, 04 Aug 2024-4:14 pm,

Bal Jeevan Scheme : ప్రస్తుత కాలంలో పిల్లల చదువుల ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా స్కూల్ ఫీజుల నుంచి కాలేజీ ఫీజుల వరకు లక్షల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి సమయంలో మీరు వారి భవిష్యత్తు కోసం డబ్బు దాచాలనుకుంటే మాత్రం పోస్ట్ ఆఫీస్ వారు అందిస్తున్న బాల జీవన బీమా యోజన స్కీమ్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ స్కీం పోస్ట్ ఆఫీస్ వారు అందిస్తున్న స్కీమ్ దీనికి కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్యారెంటీ ఇస్తోంది. దీంతో మీ డబ్బుకు ఖచ్చితమైన భరోసా అనేది లభించడం ఖాయం. అయితే ఈ స్కీము ద్వారా మీరు రోజుకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ డబ్బు ఎలా ఉపయోగపడుతుంది. ఈ పథకంలో చేరాలంటే కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి? ఇందులో ఎంత ఇన్వెస్ట్ చేయవచ్చు చివరికి ఎంత మీకు దక్కుతుంది. అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

రోజూ రూ. 18 చెల్లిస్తే రూ. 3 లక్షలు పొందవచ్చు: పోస్ట్ ఆఫీస్ వారు అందిస్తున్న బాల్ జీవన్ బీమా యోజన మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తయారుచేసిన స్కీమ్. ముఖ్యంగా ఈ స్కీం లో ప్రారంభం పెట్టుబడి విషయానికి వస్తే, కనీసం రోజుకు కేవలం 6 రూపాయలు మాత్రమే పొదుపు చేస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ అనంతరం రూ. 1 లక్ష రూపాయల హామీతో రాబడి లభిస్తుంది. అదే సమయంలో మీరు రోజుకు 18 రూపాయలు పొదుపు చేసినట్లయితే చివరికి మెచ్యూరిటీ కింద రూ. 3 లక్షల రూపాయలు మీ సొంతం అవుతాయి. ఇక మీకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే, ఈ స్కీములో పొదుపు చేసినట్లయితే రూ. 6 లక్షల రూపాయలు మీ సొంతం అవుతాయి. ఇప్పుడు ఈ స్కీములో ఎలా చేరాలి, ఈ స్కీము నియమ నిబంధనలో తెలుసుకుందాం.

బాల్ జీవన్ స్కీం రూల్స్ ఇవే: బాల్ జీవన్ బీమా పథకంలో ఐదు సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు పిల్లల పేరిట మీరు ఈ స్కీం లో చేరవచ్చు. అయితే తల్లిదండ్రుల వయస్సు 45 సంవత్సరాలు దాటకూడదు. ఇది బీమా పాలసీ కావున పాలసీ మెచ్యూరిటీ కాకముందే పాలసీదారు ప్రమాదవశాత్తు మరణిస్తే, వారు ఇకపై ప్రీమియం పూర్తిగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ గడువు ముగిసిన అనంతరం పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ లభిస్తుంది. ఒకవేళ మీరు పాలసీని మధ్యలో నుంచి బయటికి రావాలనుకుంటే, ఐదు సంవత్సరాలు అనంతరం ఈ పాలసీని సరెండర్ చేయాల్సి ఉంటుంది.  

ఈ స్కీమ్ వల్ల లాభం విషయానికి వస్తే మీకు ప్రతి సంవత్సరం 1000 రూపాయలపై కనీసం 48 రూపాయలు గ్యారంటీ మొత్తం లభిస్తుంది. ఈ బాల్ జీవన్ బీమా పాలసీ మీ సమీపంలో ఉన్న అన్ని పోస్ట్ ఆఫీస్ లోను అందుబాటులో ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. మీరు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు కావాల్సిన డాక్యుమెంట్ సిద్ధం చేసుకుంటే మీరు ఈ స్కీం లో నేరుగా చేరవచ్చు.  మీరు ప్రతిరోజు కేవలం 18 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. తద్వారా మీకు ఏకంగా 3 లక్షల రూపాయలు సొంతం అవుతాయి. 

ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే: పిల్లల ఆధార్ కార్డ్,  తల్లిదండ్రుల ఆధార్ కార్డు, పిల్లల బర్త్ సర్టిఫికేట్, చిరునామా రుజువు, మొబైల్ నంబర్, పిల్లల పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం ఉంటుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link