Balakrishna Daughters: వైరల్ అవుతున్న బాలకృష్ణ కూతుర్ల ఫోటోలు.. అఖండ 2 ఈవెంట్ లో ఈ ఇద్దరే ఆకర్షణ!

Sat, 19 Oct 2024-8:36 am,
Nandamuri Brahimi 

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటసింహ నందమూరి బాలకృష్ణ ఇటీవలే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. సినీ రంగంలోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ ఆయనను ఘనంగా సత్కరించింది.   

Nandamuri Tejaswini 

ఇక తన తదనంతరం తన వారసులను ఇండస్ట్రీలోకి ప్రవేశపెట్టడానికి బాలయ్య ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అటు మోక్షజ్ఞ తన మొదటి సినిమాతో హీరోగా లాంచ్ అవుతుండగా..మరొకవైపు ఆయన చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా అడుగుపెట్టబోతోంది. ఇక పెద్ద కూతురు నారా బ్రాహ్మిని సీఎం చంద్రబాబు నాయుడు కోడలిగానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

Akhanda 2 Pooja ceremony

ఇదిలా ఉండగా తాజాగా బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో నాలుగవసారి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజే అఖండ  -2  చాలా గ్రాండ్గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగిన ఈ పూజ కార్యక్రమంలో బాలయ్య కూతుర్లు ఇద్దరు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. 

బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మణి హీరో బాలకృష్ణ,  హీరోయిన్ ప్రగ్యా జైష్వాల్ కి క్లాప్ కొట్టింది. అలాగే చిన్న కూతురు ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. 

ఇలా కూతుర్లిద్దరూ తండ్రి సినిమాను ముందుండి నడిపిస్తుండడంతో అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు కూతుర్లు కూడా చాలా అందంగా ఉన్నారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య కూతుర్ల ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link