Balakrishna about Jr NTR: జూ.ఎన్టీఆర్ గురించి ఫైనల్ గా నోరు విప్పిన బాలకృష్ణ.. ఏమన్నారంటే..?

Tue, 07 Jan 2025-9:44 am,

ఆహా ఓటిటిలో.. ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ విత్ NBK తాజా ఎపిసోడ్..అభిమానుల మధ్య పెద్ద చర్చకు కారణమైంది. బాలకృష్ణ ఈ ఎపిసోడ్‌లో డైరెక్టర్ బాబీని ఆయన గత సినిమాల గురించి, పని చేసిన స్టార్స్ గురించి అడిగారు. అయితే, ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ గురించి.. ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం..ఎన్టీఆర్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.    

ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణపై ఉద్దేశపూర్వకంగా.. తమ అభిమాన హీరోని పక్కన పెట్టారని ఆరోపణలు చేశారు. ఈ అంశం పెద్ద దుమారాన్ని రేపడంతో పాటు బాలకృష్ణ నటిస్తున్న రాబోయే చిత్రం డాకు మహారాజ్ను బహిష్కరించాలని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణతో పాటు బీవీఎస్ రవి, క్రియేటివ్ ప్రొడ్యూసర్ తేజస్వినిని కూడా టార్గెట్ చేశారు.  

డాకు మహారాజ్ చిత్ర నిర్మాత నాగ వంశీ కూడా ఈ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ అభిమానుల మన్ననలు పొందిన నాగ వంశీ, దేవర చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విజయవంతంగా విడుదల చేశారు. ఇప్పుడు అదే అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం.. ఆయనను ఆశ్చర్యానికి గురిచేసింది.    

వివాదం సద్దుమణగాలని నాగ వంశీ సోషల్ మీడియాలో స్పందించారు. అభిమానుల మద్దతు కోరుతూ, బాలకృష్ణ వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన వివరణ ఇచ్చారు. "ఒకరోజు సినిమా సెట్‌లో చర్చ జరుగుతున్నప్పుడు బాలకృష్ణ గారు ఒక పాత్ర గురించి చెప్పి అది ఎన్టీఆర్‌కు బాగా సూటవుతుందని అన్నారు" అని నాగ వంశీ వివరించారు.  మొత్తానికి బాలకృష్ణ నోటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరు వచ్చిందని.. ఈ ఇంటర్వ్యూ చూశాక నందమూరి ఆనందంగా ఫీల్ అవుతున్నారు.  

ఇలాంటి ఫ్యాన్ వార్లు సినిమా విజయంపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ, నాగ వంశీ బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానుల మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. ఈ వివాదం త్వరగా సద్దుమణిగి అన్ని వర్గాలు కలసి పనిచేయాలని ఆయన ఆశిస్తున్నారు అనేది ఆయన పోస్టుల్లో అలానే ఇంటర్వ్యూలో స్పష్టంగా అర్థం అవుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link