Balapur Laddu Auction 2024: బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు.. వేలంలో రూ. రూ. 30.1 లక్షలకు దక్కించుకున్న కొలన్ శంకర్ రెడ్డి ..
అసలు బాలాపూర్ లడ్డూ అంటేనే బంగారంలా భావిస్తారు. ఆ లడ్డూ దక్కించుకోవడమే అదృష్టంగా పరిగణిస్తారు. వేలంలో పాల్గొన్ని లక్షల్లో ఖర్చుపెట్టి మరీ బాలాపూర్ వినాయకుడి లడ్డూ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తారు. భక్తులకు కొంగు బంగారంలా బాలాపూర్ లడ్డూ మారుతోంది.
బాలాపూర్ లడ్డూ వేలం ఎప్పుడు ప్రారంభమైంది? వినాయక చవితిలో ఎంతో విశిష్టమైన బాలాపూర్ లడ్డూ ప్రస్థానం 1994 నుంచి ప్రారంభమైంది. మొట్టమొదటిసారి బాలాపూర్ లడ్డూ వేలం నిర్వహించినప్పుడు రూ.450 తో ప్రారంభమైంది. వేలంలో దక్కించుకున్న లడ్డూను ముఖ్యంగా పొలంలో చల్లుకుంటారు.
దీంతో బంగారు పంటలే పండుతాయట. ఈ నేపథ్యంలో మొదటిసారి కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి వేలంలో బాలాపూర్ లడ్డూను దక్కించుకుని రికార్డు సృష్టించాడు. నాటి నుంచి బాలాపూర్ లడ్డూ రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది.
రానురాను బాలాపూర్ లడ్డూ ధర వేలంలో రికార్డు బ్రేక్ చేస్తోంది. గతేడాది లడ్డూ వేలంలో 36 మంది పాల్గొన్నారు. రూ.1,116 నుంచి లడ్డూ వేలం ప్రారంభమైంది. రూ.27 లక్షలకు దాసరి దయానంద రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. ముఖ్యంగా ఈ లడ్డూ వేలం డబ్బులను ఆ గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తారు. ఈ లడ్డూ వేలంలో పాల్గొనాలంటే వినాయక చవితి మొదటిరోజు నుంచే దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఈ సారి బాలాపూర్ వినాయక కమిటీ నిర్వాహకులు వేలం పాటకు సంబంధించి ఓ కొత్త నిబంధన తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే స్థానికేతరులు ముందుగానే గత ఏడాది లడ్డూ పలికిన డబ్బులు ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో బయటి వ్యక్తులు మాత్రమే లడ్డూ వేలంలో పాల్గొనే వారు.
ఈ సారి స్థానిక బాలాపూర్ గ్రామ ప్రజలు కూడా ఈ వేలంలో పాల్గొంటే ముందస్తూ డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. అంటే గత ఏడాది లడ్డూ ధర వేలం పాటలో రూ.27 లక్షలు పలికింది. ఈ డబ్బులను ఈసారి వేలంపాటలో పాల్గొనేవారు ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ కొత్త నిబంధనతో స్థోమత లేనివారిని లడ్డూ వేలంలో పాల్గొనకుండా చేశారు.
ఇదిలా ఉండగా బాలాపూర్ గణేశుడి విషయానికి వస్తే ఈసారి అయోధ్య రామాలయం సెట్‌లో బాలాపూర్ గణేషుని ఏర్పాటు చేశారు. ఈ వినాయక నవరాత్రుల్లో కొన్ని వేలమంది బాలాపూర్ గణేషుని దర్శించుకున్నారు. ఈసారి కచ్చితంగా వేలంలో ఈ వినాయకుని లడ్డూ రూ.30 లక్షలకు పైగా పలుకుతుందని అంచనా వేశారు.
ఈ కొత్త నిబంధన వల్ల ఈసారి బాలాపూర్ లడ్డూ వేలంలో కేవలం ఆరుగురు మాత్రమే పాల్గొన్నారు. బాలాపూర్ గణేశ్ ఏర్పాటు చేసి ఈ ఏడాదికి 30 ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది. అయితే, బాలాపూర్ లడ్డూ వేలంలో కైవసం చేసుకోవడం కొలను ఫ్యామిలీ నుంచే ప్రారంభమైంది. అయితే, ఈసారి కూడా 30 లక్షల ఒక్క వెయ్యికి కొలను శంకర్ రెడ్డి లడ్డూ కైవాసం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఈయన సింగిల్ విండో చైర్మన్‌గా కూడా ఉన్నారు.రూ. 1116 తో వేలం ప్రారంభమైంది.