Avika Gor Pics : చిన్నారి పెళ్లికూతురు అందాల ప్రదర్శన.. అక్కడి టాటూ కనిపించేలా అవికా గోర్
చిన్నారి పెళ్లికూతురు (హిందీలో బాలికా వధు) సీరియల్‌లో ఆనంది పాత్రలో కనిపించి మెప్పించింది అవికా గోర్. బాలనటిగా అవికా గోర్ అందరినీ ఆకట్టుకుంది.
ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. రాజ్ తరుణ్, అవికా గోర్ జోడి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తెలుగులో అవికా గోర్‌కు మంచి అవకాశాలే వచ్చాయి. అయితే అవికాకు మాత్రం సరైన కమర్షియల్ హిట్ పడటం లేదు. స్టార్ హీరోయిన్ అని అనపించుకోవడం లేదు.
అవికా గోర్ ఆ మధ్య తన బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్పింది. కానీ ఇంత వరకు మళ్లీ ఆ విషయం మీద స్పందించలేదు.
అవికా గోర్ మాత్రం సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనకు సై అంటోంది. జీరో సైజ్‌లోకి మారిన అవికా అందాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. భుజం మీదున్న టాటూను చూపిస్తూ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.